రామ్ చరణ్ పోలీస్ ఆఫీసరా..? (‘బ్రూస్ లీ’ కొత్త ట్రైలర్)

By Bojja Kumar

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రూస్ లీ' చిత్రం ఈ నెల 16న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త ట్రైలర్ విడుదలయింది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లక్కేయండి మరి.

ఈసినిమాకు సంబంధించిన స్టోరీ లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ బ్రూస్ లీగా నటిస్తున్నాడని, అయితే కొందరు ఆయన చెల్లిని చంపడంతో ఉద్యోగం మానేసి స్టంట్ మాస్టర్ గా మారుతాడని, ఓ సినిమా టీంలో జాయిన్ అవుతాడని, తన చెల్లిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటారని, బ్రూస్ లీ చెల్లిని ఎందుకు చంపారనేది మిగతా స్టోరీ అని అంటున్నారు.

రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రూస్ లీ'. బ్రూస్ లీ చిత్రాన్ని వరల్డ్ వైడ్ దాదాపు 2000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కానన్ని అత్యధిక స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవుతోంది. 220 స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' చిత్రం విడుదలవుతోంది.

 Bruce Lee The Fighter Release Trailer

రామ్ చరణ్ హీరోగా కావడం, శ్రీను వైట్ల దర్శకత్వం, మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఇలా సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు. రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X