బృందావనమది అందరిది టీజర్ విడుదల.. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
జస్ట్ ఎంటరర్ టైన్ మెంట్ క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ తేజ డైమండ్స్ సికింద్రాబాద్ అధినేత శ్రీనివాస్ వంగల, ప్రభాకర్ రెడ్డి కూతురు (ఎన్నారై)
నిర్మాతలుగా సక్సెస్ ఫుల్ రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బృందావనమది అందరిది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని సెంపుల్ వీడియో విడుదల చేశారు.
ఈ సందర్బంగా దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ.. వైజాగ్ సాగర తీరంలో వేయించిన హీరోయిన్ ఇంటి సెట్ సన్నివేశాలను రిచా పణయ్, హర్షవర్ధన్ రాణే, ఎంపీ శివప్రసాద్, హీరా సాహిలి, బెనర్జి, తాగుబోతు రమేష్, భద్రంతో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అనే భయం నాపై పడకుండా మా టెక్నిషియన్స్, ఆర్టిస్ట్స్‌లకు ఎంతో సహాయం అందించారు.

మా ఫస్ట్ షెడ్యూల్ మేకింగ్ అండ్ సెంపుల్ వీడియో టీజర్ని మన తెలుగు కొత్త సంవత్సరం లో విడుదల చేశాము. ఫ్రెండ్స్ నుంచి పెద్ద హీరోల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ నాకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది. మిగతా షెడ్యూల్ ఏప్రిల్1 నుంచి బెంగళూరులో 7డేస్ తర్వా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుపుకుంటుందని ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ సీపాన తెలిపారు.


Click it and Unblock the Notifications











