సెట్లో చిరుకి ఆహ్వానం పలుకుతున్న రామ్ చరణ్
హైదరాబాద్ : నాన్నగారుతో షూటింగ్..చాలా సంతోషంగా ఉంది. ఆయన మా బ్రూస్ లీ చిత్రంలో భాగం పంచుకుంటున్నందుకు హ్యాపీ. మెగాస్టార్ కు ఆహ్వానం.. అంటున్నారు రామ్ చరణ్. ఈ రోజు నుంచి చిరంజీవి..రామ్ చరణ్ చిత్రంలో కనిపించటానికి షూటింగ్ కు హాజరవుతున్నారు. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ ఇలా తన ఆనందాన్ని ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసుకున్నారు.
Dad at shoot..Really happy and honoured to have him as part of #BruceLeeTheFighter #WelcomeBackMegastar
Posted by Ram Charan on 27 September 2015
ఈ చిత్రంలో చిరంజీవి 15 నిముషాల పాటు కనిపించనున్నారు.. రామ్ చరణ్, చిరంజీవి లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను కొద్ది రోజుల పాటు తీస్తారు. చిరంజీవి చాలా రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవటంతో అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి ఈ చిత్రంలో చేయబోయే సీన్స్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది.
లారెన్స్ స్టైల్ సినిమాలో చేసినట్లుగానే చిరంజీవి ఈ సినిమాలో రామ్ చరణ్ ని క్లైమాక్స్ ముందు ఓ కష్టం నుంచి బయిటపడేస్తారు. రకుల్ ప్రీతి ని విలన్స్ నుంచి కాపాడటానికి చిరంజీవి హెల్ప్ చేస్తారు. రామ్ చరణ్ వంటి హీరోకి హెల్ప్ చేయగలవారు ఎవరా అని ఆలోచించి చిరంజీవి అయితేనే బెస్ట్ అని ఒప్పించినట్లు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి తన నిజ జీవితలో లాగానే మెగాస్టార్ చిరంజీవి గా సినిమా హీరోగా కనిపిస్తారు. అయితే ఇదంతా నిజమా కాదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే.

బ్రూస్ లీ విశేషాలకు వస్తే...
రామ్ చరణ్ అలుపెరగకుండా ఏకధాటిగా 17 గంటలపాటు షూటింగ్‌లో పాల్గొన్నాడు. 'బ్రూస్‌లీ'లో ఫైటర్‌గా రామ్‌చరణ్ ఎలాంటి పోరాటాలు చేశాడో తెలియదు కానీ అనుకొన్న సమయానికి ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పెద్ద పోరాటమే చేస్తున్నాడని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బ్రూస్‌లీ' తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో 'మెగా మీటర్...' అనే పాటని తెరకెక్కిస్తున్నారు. ఆ పాట కోసమే రామ్‌చరణ్ ఏకధాటిగా 17 గంటలపాటు చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఆ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ పాటలో రకుల్‌ప్రీత్ సింగ్ ఆడిపాడుతోంది. డ్యాన్స్ చేస్తూ గాయపడ్డప్పటికీ చిత్రీకరణలో పాల్గొందట రకుల్. 'బ్రూస్‌లీ' పాటల్ని వచ్చే నెల 2న, సినిమాని 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్న చిరంజీవి త్వరలో సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''బ్రూస్‌లీకి వీరాభిమాని అయిన ఓ యువకుడి కథ ఇది. తనకు ఎదురైన ఓ సమస్యపై ఎలా పోరాటం చేశాడన్నది తెరపైనే చూడాలి. వినోదం, కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. రామ్‌చరణ్ చేసే యాక్షన్, డ్యాన్సులు అభిమానుల్ని అలరించేలా ఉంటాయి. ఇటీవల విడుదలైన 'లే చలో...' పాటకి మంచి స్పందన లభిస్తోంది. పాటల్ని వచ్చే నెల 2న, చిత్రాన్ని 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.
చిరంజీవి గెస్ట్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ...56.45 కోట్ల వరకూ జరగటంతో ట్రేడ్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. నిర్మాతకు టేబుల్ ఫ్రాఫిట్స్ తెచ్చిపెడుతున్న ఈ చిత్రం.
"వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.
చిత్రం ఆడియో రైట్స్ ని జీ మ్యూజిక్ వారు తీసుకున్నట్లు సమాచారం. మరో ప్రక్క ఈ ఆడియో పంక్షన్ ని సింపుల్ గా లాగించేయాలని హీరో,దర్శకుడు నిర్ణయించినట్లు సినివర్గాల సమాచారం. అలాగే చిరంజీవి తప్ప మరెవరూ స్పెషల్ గెస్ట్ లుగా ఇన్వైట్ చేయలేదని చెప్తున్నారు.
ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











