బ్రయాన్ ఆడమ్స్ టూర్: ఇంటర్నేషనల్ రాక్‌స్టార్‌కు స్వాగతం పలకనున్న ప్రభాస్, అమితాబ్!
ప్రపంచ ప్రఖ్యాత రాక్ స్టార్ గా గుర్తింపు పొందిన బ్రయాన్ ఆడమ్స్ అక్టోబర్ లో ఇండియాలో పర్యటించబోతున్నారు. 5 రోజులపాటు బ్రయాన్ ఆడమ్స్ టూర్ ఇండియాలో కొనసాగనుంది. భారీ ఎత్తున ఈ ఈవెంట్స్ ని నిర్వాహకులు నిర్వహించబోతున్నారు. హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాలలో బ్రయాన్ స్టేజి షో లని ఘనంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. బ్రయాన్ టూర్ గురించి మరో ఆసక్తికర విషయం ప్రభాస్ ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తుతోంది.

బ్రయాన్ కోసం బాహుబలి
బ్రయాన్ హైదరాబాద్‌కు వచ్చే సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హోస్ట్ గా మారి అతడికి స్వాగతం పలకబోతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత రాక్ స్టార్ తో స్టేజి పంచుకోవడం నిజంగా ప్రభాస్ కు దక్కుతుంది అరుదైన గౌరవం అని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.

అమితాబ్ బచ్చన్
ముంబైలో కూడా బ్రయాన్ స్టేజి షో జరగనుంది. ఇండియా టాప్ స్టార్ అమితాబ్ ముంబైలో బ్రయాన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తారట. ఈ షోకు బాలీవుడ్ ప్రముఖ తారలు దీపికా, రణవీర్ సింగ్, అలియా భట్, వరుణ్ ధావన్ వంటి స్టార్లు హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
7 ఏళ్ల తరువాత
బ్రయాన్ ఆడమ్స్ గతంలో 2011 లో ఇండియాకు వచ్చాడు. మాలి ఏడేళ్ల తరువాత ఈ రాక్ స్టార్ ఇండియాలో అడుగుపెట్టబోతుండడం విశేషం. 2015 లోనే బ్రయాన్ ఇండియాకు రావాల్సి ఉన్నా అనుకోని కారణాల వలన ఆ షెడ్యూల్ రద్దయింది.

90 దశకంలో
90 దశకంలో బ్రయాన్ రాక్స్ స్టార్ గా ఓ వెలుగు వెలిగాడు. ఇదిలా ఉండగా బ్రయాన్ ఇండియా టూర్ లో హోస్ట్ లుగా ప్రభాస్, అమితాబ్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











