బి.ఎస్.పి చూపు పవన్ వైపే
ఉత్తర్ ప్రదేశ్ లో అధికారం నెరపుతున్న బి.ఎస్.పి ఆంధ్రప్రదేశ్ లోను అధికారాన్ని చేజిక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఫేస్ వాల్యూ ఉన్న నాయకుని కోసం అన్వేషణ ప్రారంభించింది. చిరంజీవినే వలలో వేసుకుందామని మాయావతి భావించినప్పటికీ ఆయన ధైర్యం చేయకపోవడంతో ఇపుడు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై కన్నేసింది. ఆంధ్రలో విజయనగర్ శాసన సభా సీటునే కైవసం చేసుకున్న బి.ఎస్.పి పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి తమ పార్టీలో ఉంటే పవర్ జిమ్మిక్కులు ఎన్నో చేయొచ్చని యోచిస్తున్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఏం నిర్ణయం తీసుకోనున్నాడో వేచిచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











