బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం కొట్టేసిన బబ్లీ హీరోయిన్

By Nageswara Rao

నందమూరి బాలకృష్ణతో ఎంతో ప్రతిష్టాత్మకంగా పరుచూరి మురళి ఓ సినిమా తీస్తున్నారు. ఈసినిమాలో బాలయ్య బాబు మూడు రకాలైన గెటప్స్ వేసి అలరించనున్న సంగతి తెలిసిందే. పేరు ఇంకా పెట్టనటువంటి ఈసినిమాలో బాలయ్య బాబు సరసన కాంచనమాల కేబుల్ టివి హీరోయిన్ లక్ష్మీరాయ్ ఓ హీరోయిన్‌గా బుక్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన రెండవ హీరోయిన్‌గా బబ్లీ గర్ల్ ఛార్మీ లీడ్ రోల్ పోషించడానికి సిద్దమయ్యారు.

మూడవ హీరోయిన్‌గా మరో హీరోయిన్ తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈసినిమాని కీర్తి కంబైన్స్ ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తుండగా ఈసినిమాకి దర్శకత్వం పరుచూరి మురళి వహిస్తున్నారు. ఇక ఛార్మీ విషయానికి వస్తే ప్రస్తుతం చార్మి నటించినటువంటి మంగళ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. చార్మి కూడా వరుస ఫ్లాపులతో సతమతమవుతూ ఉండండతో బాలయ్య బాబు సరసన ఈఅవకాశం అయినా టాలీవుడ్ లో తన స్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుందేమో చూద్దాం.

ఇక ఈసినిమాలో జయసుధ, కోట శ్రీనివాసరావు, డాక్టర్ బ్రహ్మనందం, చరణ్ రాజ్, ఎమ్ ఎస్ నారాయణ, వేణు మాధవ్, ఆదిత్య మీనన్ తదితర తారాగణం నటిస్తున్నారు. ఈసినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక బాలయ్య బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రాజారాముడి రమణీయ గాథతో బాపు, రమణల ద్వయం రూపొందిస్తున్న పౌరాణిక చిత్రరాజం- 'శ్రీరామరాజ్యం". శ్రీరామచంద్రుడిగా బాలకృష్ణ, సీతగా నయనతార నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముఫ్ఫైఅయిదు శాతం పూర్తయింది. ఈ సందర్బంగా నిర్మాత యలమంచిలి సాయిబాబు మాట్లాడుతూ-''మహాయజ్ఞంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మానవాళికి మార్గ్గదర్శకుడైన శ్రీరామచంద్రమూర్తి గొప్పతనాన్ని, ఆయన అవతార విశిష్టతను తెలపడం జరుగుతుందని అన్నారు.

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో రాజప్రాసాదం, ఏకాంత మందిరం, కౌసల్యామందిరం మొదలగు సెట్స్ నిర్మాణం జరుగుతోంది. మార్చి 31 నుంచి షూటింగ్ పూర్తయ్యే వరకు నిరవధికంగా చిత్రీకరణ జరుపుతాం. ఇప్పటి వరకు మూడు పాటలు, లవకుశుల జననం, లక్ష్మణుడు అడవిలో సీతను వదిలేయడం, వాల్మీకి ఆమెకు ఆశ్రయం అందించడం లాంటి కీలక సన్నివేశాలను చిత్రీకరించాం.

వాల్మీకిగా పద్మవిభూషణ్ అక్కినేని నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఇంకా లక్ష్మణుడిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్, చాకలి తిప్పడిగా బ్రహ్మానందం, జనకుడిగా మురళీమోహన్, భూదేవిగా జయసుధ, ఆంజనేయుడిగా విందు ధారాసింగ్, వశిష్ఠుడిగా సీనియర్ నటుడు బాలయ్య నటిస్తున్నారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఎనిమిది పాటలను ఇప్పటికే రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం"" అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X