Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్‌రైజర్స్‌ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఇంట్రస్టింగ్ గా ఉన్న బబ్లీహీరోయిన్ టర్నింగ్ పాయింట్
సినిమాలకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం మాది. సినిమాల్లోకి అనుకోకుండానే వచ్చా. నేనో పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ యాడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి నన్ను చూశాడు. ఆ తర్వాత ఓ యాడ్ లో చేయడానికి పిలుపు వచ్చింది. అదీ అమితాబ్ బచ్చన్ వంటి మహా నటుడితో. ఎవరైనా వదులుకుంటారా అలాంటి ఆఫర్ ని! నేనూ అంతే. అది చేసిన మూడు నెల్లకే తొలి సినిమా ఆఫర్ వచ్చింది.
తెలుగులో సూపర్‌హిట్టయిన 'నువ్వే కావాలి'ని హిందీలో 'తుఝే మేరీ కసం' పేరుతో తీయడానికి రామోజీరావు గారు ప్లాన్ చేశారు. మా అమ్మతో పాటు వెళ్లి రామోజీరావు గారినీ, దర్శకుడు విజయభాస్కర్ గారినీ కలిశా. ఆ మీటింగ్ మొత్తం మీద నేనొక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటి అవకాశాలు ఒకే ఒక్కసారి వస్తాయనీ, వాటిని ఉపయోగించుకోవాలనీ అమ్మ నన్ను కన్విన్స్ చేసింది. నేనప్పుడే హైస్కూల్ పూర్తిచేశా. నేను ఆల్ రౌండర్ని. సవాళ్లంటే ఇష్టం. సినిమాలు నాకు తాజా సవాళ్లని విసిరాయి.
కెమెరా ముందు తొలిసారి నిల్చున్నప్పుడు నేను భయపడలేదు. ఒకసారి కెమెరా ఆన్ అవగానే అంతకుముందున్న నెర్వస్ నెస్ మాయమైపోయింది. మధ్యలో 'బాయ్స్' (తమిళ్) కోసం డైరెక్టర్ శంకర్ నుంచి కాల్ వచ్చింది. అయితే ప్రాంతీయ భాషలో నటించాలా, వద్దా అనేది నిర్ణయించుకోలేదు. ఏదైతేనేం, హిందీ, తమిళ్, తెలుగు సినిమాలతో తొలి యేడాది క్లిష్టంగా గడిచింది. నాకు భాష సమస్యగా మారింది. తెలుగు, తమిళంలో మాట్లాడటం కష్టమైపోయింది. అయినా పట్టుదలతో డైలాగులు నేర్చుకుని ప్రాంప్టింగ్ అవసరం లేకుండానే చెప్పగలిగా. 'బాయ్స్' సెట్స్ మీద నేను ఇబ్బంది పడుతుంటే డైలాగుల విషయంలో సిద్ధార్థ్ బాగా సాయపడ్డాడు.