‘జబర్దస్త్’ను ఆకాశానికెత్తేశాడు.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కామెంట్స్ వైరల్
సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి దొరికే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోదు చిత్రయూనిట్. సోషల్ మీడియా, బుల్లితెర ఇలా ఏ తేడా లేకుండా అన్ని చోట్లా ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఉప్పెన సినిమాకు కూడా ఓ రేంజ్ ప్రమోషన్స్ కల్పించారు. అయితే సినిమా కూడా అంచనాలకు మించి ఆడేస్తోంది. మొదటి రోజే దిమ్మతిరిగే కలెక్షన్లు సొంతం చేసుకుంది. అలా ప్రమోషన్స్ పీక్స్‌లో చేయడంతో ఉప్పెన ప్రతీ ఒక్కరికీ రీచ్ అయింది.

బుల్లితెరపై అలా..
వెండితెరపై ఉప్పెనను ప్రమోట్ చేసేందుకు టీం బుల్లితెరపై రచ్చ చేస్తోంది. మామూలుగా తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు బిగ్ బాస్, జబర్దస్త్ వంటి షోలను వాడేస్తుంటారు. తాజాగా ఉప్పెన కూడా బుల్లితెరపై షోల్లో సందడి చేసి తమ ఉప్పెన చిత్రాన్ని ప్రమోట్ చేసుకునేందుకు వచ్చారు.

అక్కడ అలా..
సుమ హోస్ట్‌గా వస్తోన్న బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో ఉప్పెన టీం వచ్చింది. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఇలా అందరూ వచ్చారు. అక్కడ కూడా హీరో హీరోయిన్లతో మంచి రొమాన్స్ పండించారు. అలా ఆ షో ద్వారా ఉప్పెనను ప్రమోట్ చేసుకున్నారు.

జబర్దస్త్‌లో ఇలా..
అయితే ఉప్పెన టీం ప్రమోషన్స్‌లో భాగంగా వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబు సన ఇద్దరూ కూడా జబర్దస్త్ షోలో సందడి చేసేందుకు వచ్చారు. వచ్చే వారం ప్రసారం కాబోతోన్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో బుచ్చిబాబు ఆ షోపై ప్రశంసలు కురిపించాడు.

స్కిట్లు, లైవ్ పర్ఫామెన్స్..
మామూలుగా ప్రేక్షకులు అయితే జబర్దస్త్ స్కిట్లను ఎడిటింగ్ అయ్యాక చూస్తుంటారు. కానీ అక్కడ ఉండే జడ్జ్‌లు, వచ్చే గెస్ట్‌లు మాత్రం లైవ్‌లొనే చూస్తుంటారు. అలా జబర్దస్త్ షోను లైవ్‌గా చూడటం, ఆర్టిస్ట్‌ల పర్ఫామెన్స్‌పై బుచ్చిబాబు కామెంట్ చేశాడు.

చార్మినార్‌లా..
చిన్నప్పుడు చార్మినార్ గురించి విన్నాను.. హైద్రాబాద్ కొత్తలో వచ్చినప్పుడు మా ఫ్రెండ్ చార్మినార్ దగ్గరికి తీసుకెళ్లి చూపించాడు.. ఇన్ని రోజులు టీవీల్లో చూసిన ఈ షోను.. ఇలా లైవ్‌లో చూడటంతో నాటి రోజులు గుర్తుకు వచ్చాయి. లైవ్‌లో ఇలా చూడటం ఎంతో బాగుందని బుచ్చిబాబు ఆ షోను ఆకాశానికెత్తేశాడు.


Click it and Unblock the Notifications











