Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ఉప్పెన’ కథను మొదట చెప్పింది ఎన్టీఆర్కే.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్లో ఫిబ్రవరి మొత్తం సినిమాలతో నిండిపోయి ఉంది. అయితే ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న అన్ని సినిమాల్లోకెల్లా ఉప్పెన మాత్రం స్పెషల్‌గా నిలుస్తుంది. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ కావడం ఒకే విశేషం అయితే.. సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు సన దర్శకుడిగా మారబోతుండటం మరో విశేషం. అలా బుచ్చిబాబు సన తాజాగా కొన్ని విషయాలను బయటపెట్టేశాడు. సుకుమార్ దగ్గర దాదాపు ప్రతీ సినిమాకు బుచ్చిబాబు పని చేశాడు.
శృంగారం ఒలకబోస్తున్న పార్వతీ నాయర్.. మీరు ఎప్పుడూ చూడని హాట్ ఫోటోలు
ఎన్టీఆర్‌తో చనువు..
సుకుమార్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాకు కూడా బుచ్చిబాబు పని చేశాడు. ఆ సమయంలో ఎన్టీఆర్‌తో ఎంతో చనువుగా ఉన్నాడట. అందుకే తన ఉప్పెన కథను, స్టోరీలైన్‌ను కూడా వినిపించాడట. ఈ మేరకు బుచ్చిబాబు తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ట్రైలర్ రిలీజ్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఉప్పెన ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు. మొత్తానికి ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ట్రైలర్ ఓ వైపు దూసుకుపోతోండగా.. బుచ్చిబాబు సన చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతోన్నాయి. ఎన్టీఆర్ మీదున్న ప్రేమను బుచ్చిబాబు అలా బయటపెట్టేశాడు.
కథ ఎవరి కోసం..
కథ ఎవరి కోసం రాసుకున్నా కూడా మొదటి వినిపించింది మాత్రం ఎన్టీఆర్.. మొదటి నుంచి ఈ స్టోరీని ఎన్టీఆర్‌కు వినిపించాను.. మధ్య మధ్యలో షూటింగ్ జరుగుతూ ఉండగా కూడా ఎలా వస్తోందని సినిమా గురించి ఎన్టీఆర్ అడిగే వారంటూ బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు.
కథ వినిపించా? చాన్స్ అడిగాడా?
అయితే బుచ్చిబాబు సన కేవలం చనువుతో కథ వినిపించాడా? లేదా సినిమాలో నటించమని.. తాను డైరెక్ట్ చేస్తానని అడిగాడా? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఏది ఏమైనా మొదటి సినిమాతోనే బుచ్చిబాబు తన మార్క్ చూపించేలా ఉన్నాడు. ఇప్పటికే ట్రైలర్‌తో సినిమాపై అంచనాలన్నీ రెట్టింపయ్యాయి. ఫిబ్రవరి 12న ఈ మూవీ విడుదల కానుంది.