ఇలా చేశాడేంట్రా బాబు అనుకున్నాను.. వైష్ణవ్ తేజ్‌పై బుచ్చిబాబు కామెంట్స్
మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ అనే కొత్త హీరో రాబోతోన్న సంగతి తెలిసిందే.ఉప్పెన అంటూ ప్రేక్షకుల ముందు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఫిబ్రవరి 12న రాబోతోన్నాడు.అయితే ఈ క్రమంలో ఉప్పెన ప్రమోషన్స్‌ను చిత్రయూనిట్ పెంచేసింది. హీరో హీరోయిన్ దర్శకుడు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.అయితే ఇలా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న క్రమంలో దర్శకుడు, హీరో కొన్ని విషయాలను బయట పెట్టేశారు.

ఆర్మీ వైపు..
మామూలుగా వైష్ణవ్ తేజ్ హీరో అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదట. ఏది అవ్వాలి.. ఏం చేయాలనే ఓ క్లారిటీతో ఉండేవాడు కాదట. చివరకు ఆర్మీలోకి వెళ్దామని ఫిక్స అయ్యాడట. ఆక్రమంలో కాస్త ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాడట. ఆ సమయంలో కాస్త సన్నబడటం ఆ ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో ఉప్పెన ఆఫర్ వచ్చిందని వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

నటన రాదు..
అలా ఇన్ స్టాలో పోస్ట్‌లు చూసిన దర్శకుడు బుచ్చిబాబు.. వైష్ణవ్ తేజ్‌నే హీరోగా ఫిక్స్ అయ్యాడట. వెళ్లి కథ చెబితే.. వైష్ణవ్ తేజ్ విన్నాడట.. బాగుందని అన్నాడట. కానీ తనకు నటన రాదని, వాటి గురించి ఏమీ తెలియదని అన్నాడట. అదంతా తాను చూసుకుంటానని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడట.

ఆ సీన్ కోసం..
ఓ ఎమోషనల్ సీన్‌లో వైష్ణవ్ తేజ్ బాగా కష్టపడాల్సి వచ్చిందట. దాని గురించి చెబుతూ.. ఓ సీన్‌లో చాలా ఎమోషనల్ అవ్వాల్సి ఉంటుంది.. ఆ సీన్‌లో మొదటి షాట్‌లోనే కృతి బాగా చేసేసింది. కానీ నేను సరిగ్గా చేయలేకపోయాను.. ఎందుకో నాక్కూడా సంతృప్తిగా అనిపించలేదు. కానీ డైరెక్టర్ మాత్రం ఓకే అన్నారు. కానీ రెండో రోజూ కూడా చేద్దామని అన్నాను అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

దర్శకుడు అలా..
వైష్ణవ్ తేజ్ కళ్లు పలికే భావాలు చాలు.. ఆయన డైలాగ్ చెప్పకపోయినా కూడా కళ్లు చెప్పేస్తాయి.. షూటింగ్ అయిన ప్రతీ రోజూ వెళ్లి ఎడిటింగ్ రూంలో చూస్తుంటే ఇళా చేశాడేంట్రా బాబు అని అనుకునే వాడిని అంటూ బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. ఆ ఎమోషనల్ సీన్‌లో హీరోయిన్ కంటే హీరోకు వంద రెట్ల ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా వైష్ణవ్ అదరగొట్టేశాడంటూ బుచ్చిబాబు తెలిపాడు.


Click it and Unblock the Notifications











