విజయ్ సేతుపతి డబ్బింగ్‌పై నెగెటివ్ కామెంట్స్.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు క్లారిటీ
ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి, ఆయన పాత్రను మలిచిన తీరు అన్నీ కూడా ప్లస్ అయ్యేలానే ఉంది. అయితే ట్రైలర్‌లో విజయ్ సేతుపతి గంభీరంగానే కనిపించినా కూడా.. ఆపాత్రకు చెప్పించిన డబ్బింగ్‌పై కొందరు నెటిజన్లు పెదవి విరిచారు. డబ్బింగ్ ఏ మాత్రం సూట్ అవ్వలేదని నెగెటివ్ కామెంట్స్ చేశారు. తాజాగా దీనిపై డైరెక్టర్ బుచ్చిబాబు సన క్లారిటీ ఇచ్చాడు. ఆ పాత్ర, దాని డబ్బింగ్ వెనుకున్న కథను వివరించాడు.

డబ్బింగ్ చెప్పలేను..
మొదటగా విజయ్ సేతుపతి ఈ కథ విన్న వెంటనే ఈ పాత్రకు నా వాయిస్ సెట్ కాదు అని అన్నాడు. అందుకే మేం వేరే ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించాలని చూశాం. ఎంతో మందిని ట్రై చేశాం. ఇంతకు ముందు విజయ్ సేతుపతికి తెలుగులో డబ్బింగ్ చెప్పిన వారిని కూడా సంప్రదించామని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు.

ఎక్కువ రెమ్యూనరేషన్..
విజయ్ సేతుపతి పాత్రకు బొమ్మాళి రవిశంకర్ (సాయి కుమార్ సోదరుడు)ను తీసుకున్నాం. దాదాపు ఇండియాలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేది ఆయనే. అలాంటి ఆయనతో విజయ్ సేతుపతి పాత్రకు డబ్బింగ్ చెప్పించామని బుచ్చిబాబు తెలిపాడు.

ఒక్క రోజులోనే..
మామూలుగా అయితే రవి శంకర్ అలా వచ్చి ఇలా డబ్బింగ్ చెప్పి వెళ్లిపోతాడు. ఒక్క రోజులోనే ఎలాంటి పాత్రైనా, సినిమా అయినా కూడా డబ్బింగ్ చెప్పేసి వెళ్లిపోతారట. అలాగే మా సినిమా కూడా ఒక్క రోజులోనే డబ్బింగ్ చెప్పేసి వెళ్లిపోతానని అనుకున్నారంటూ బుచ్చిబాబు నాటి విషయాలను చెప్పుకొచ్చాడు.

మూడు రోజులు..
ఒక్క రోజులో చెబుదామని వచ్చిన రవిశంకర్ సినిమా చూసి ఇదేంటి ఇలా ఉందని మూడు రోజులు ఉండి మరీ డబ్బింగ్ పూర్తి చేశారు. ఒక్క రోజే కదా అని బట్టలు కూడా ఏమీ తెచ్చుకోలేదు.. సాయి కుమార్ గారి ఇంటికి వెళ్లి బట్టలు తెచ్చుకుని మూడు రోజులు ఉండి డబ్బింగ్ చెప్పి వెళ్లిపోయారంటూ బుచ్చిబాబు అన్నాడు.

కచ్చితంగా భయపడతారు..
ఉప్పెనలో విజయ్ సేతుపతి కచ్చితంగా భయపెడతాడు.. ఈ వాయిస్ మరింత భయపెడుతుందని బుచ్చిబాబు ఎంతో ధీమాగా చెప్పుకొచ్చాడు. మరి పూర్తి సినిమాలో విజయ్ సేతుపతి డబ్బింగ్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి. అయితే ఈ చిత్రాన్ని తమిళ్‌లో కూడా తీసుకెళ్లేందుకు విజయ్ సేతుపతి ప్రయత్నిస్తున్నాడట.


Click it and Unblock the Notifications











