‘Pushpa’ ఒక్కటే పది KGFలో సమానం: ఫస్ట్ పార్ట్ చూశానంటూ హైలైట్స్ లీక్ చేసిన ‘ఉప్పెన’ డైరెక్టర్

తెలుగు సినిమా స్టామినా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. ఫలితంగా టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు భారీ చిత్రాలను రూపొందించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా చిత్రాలు పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందుతోన్నాయి. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న 'పుష్ప' ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా గురించి 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే సినిమాలోని హైలైట్లను రివీల్ చేశాడు. ఆ సంగతులు మీకోసం!

Recommended Video

Pushpa రెండు భాగాలు గా వర్కౌట్ అవుతుందా.. బన్నీ, Sukumar తర్జన భర్జన || Filmibeat Telugu
 ‘పుష్ప'గా రెడీ అవుతున్న అల్లు అర్జున్

‘పుష్ప'గా రెడీ అవుతున్న అల్లు అర్జున్

లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం 'పుష్ప'. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. అనసూయ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది.

పుష్ప రాజ్‌గా మారేందుకు బన్నీ ఇలా

పుష్ప రాజ్‌గా మారేందుకు బన్నీ ఇలా

విభిన్నమైన స్టైల్స్‌తో స్టైలిష్ స్టార్‌గా పేరొందిన అల్లు అర్జున్.. 'పుష్ప' మూవీతో ఐకాన్ స్టార్‌గా మారాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసాలు సైతం చేస్తున్నాడు. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో లారీ డ్రైవింగ్‌ నేర్చుకున్న అతడు.. రియల్ స్టంట్స్ కూడా చేస్తున్నాడు. అంతేకాదు, చిత్తూరు యాసను కూడా మాట్లాడుతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మూవీలో అతడు డీ గ్లామర్‌గా కనిపిస్తున్నాడు.

ఒక్కటి కాదు.. రెండు భాగాలుగా పుష్ప

ఒక్కటి కాదు.. రెండు భాగాలుగా పుష్ప

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఇది దేశ వ్యాప్తంగ చర్చనీయాంశం అయింది. ఇలాంటి సమయంలోనే తాజాగా నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ కూడా ఈ వార్తను ధృవీకరించారు. ఇక, ఇందులో మొదటి భాగం దసరాకు గానీ సంక్రాంతికి గానీ విడుదల కాబోతుందని టాక్.

రిలీజ్‌కు ముందే రికార్డు క్రియేట్ చేశాడు

రిలీజ్‌కు ముందే రికార్డు క్రియేట్ చేశాడు

పుష్ప సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం 'Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. తద్వారా తెలుగులోనే ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా నిలిచింది. ఈ మధ్యనే 70 మిలియన్ మైలురాయి దాటింది.

డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు

డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు

పుష్ప మూవీ భారీ బడ్జెట్‌తో ఐదు భాషల్లో రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై అన్ని ఇండస్ట్రీల కన్నూ పడింది. దీనికి తోడు చాలా మంది ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సన సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పుష్ప మూవీ 10 కేజీఎఫ్‌లతో సమానం

పుష్ప మూవీ 10 కేజీఎఫ్‌లతో సమానం

తాజాగా బుచ్చిబాబు సన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా 'పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్‌ను చూశాను. ఇందులో హీరో ఎలివేషన్ సీన్స్, మాస్ బ్యాగ్రౌండ్, అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ అదిరిపోయాయి. ఇది చూసిన తర్వాత ఎవరికైనా బన్నీ గారిలా ఎవరూ నటించలేరేమో అనిపిస్తుంది. మొత్తంగా ఈ సినిమా పది కేజీఎఫ్‌లతో సమానం అని చెప్పొచ్చు' అంటూ చెప్పుకొచ్చాడు.

ఫస్ట్ పార్ట్ చూశానంటూ హైలైట్స్ లీక్ చేసి

ఫస్ట్ పార్ట్ చూశానంటూ హైలైట్స్ లీక్ చేసి

ఈ సినిమాలో మిగిలిన హైలైట్ల గురించి మాట్లాడుతూ.. 'పుష్పలో దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. కొన్ని పాటలైతే నేను ఇప్పటికీ హమ్ చేసుకుంటున్నా. ఇక, మా గురువు గారు సుకుమార్ సార్ మీద అసూయ కలిగింది. అలాంటి కథతో పుష్ప మూవీని తెరకెక్కించారు' అని పేర్కొంటూ బుచ్చిబాబు అంచనాలను పెంచాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X