twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ , అమితాబ్ ల కాంబినేషన్ బుడ్డా చిత్రం కథ ఇదే?

    By Srikanya
    |

    దర్శకుడు పూరీ జగన్నాధ్, అమితాబ్ కాంబినేషన్ లో బుడ్డా హోగయా తేరా బాప్ చిత్రం జూలై ఒకటవ తేదిన విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో అమితాబ్ విజు(విజయ్) అనే పాత్రను పోషిస్తున్నారు. అతను మాజీ గ్యాగస్టర్.ప్యారిస్ లో సెటిల్ అవుతాడు. అయితే అతనికో లాస్ట్ జాబ్ ఉంటుంది. దాన్ని పూర్తి చేయటానికి సిటీకి తిరిగి వస్తాడు. అయితే అతని గతం అతనికి మాటి మాటికి అడ్డుపడుతూంటుంది. దాంతో తన లక్ష్యాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.

    ఇక విజయ్ పాత్ర గతంలో అమితాబ్ చేసిన దీవార్,అగ్నిపధ్ ,జంజీర్ చిత్రాలలోని యాంగ్రీ యంగ్ మెన్ లా ఉంటుంది. అలాగే దర్శకుడు పూరీ జగన్నాధ్ ఇందులో డబ్బైలు,ఎనభైల నాటి ఎలిమెంట్స్ అప్పటి ప్రేక్షకులకు నచ్చి ఇప్పటికి అమితాబ్ ప్యాన్స్ మెచ్చుకునే వాటిని చూపుతున్నారు.

    ఇక ఈ చిత్రంలో తన క్యారెక్టర్ గురించి అమితాబ్ చెబుతూ..'నువ్వు ముసలాడివి' అని ఎవరైనా అంటే వాళ్ల తాట తీస్తాను. ఆ మాటే అంటే అస్సలు నచ్చదు.'బుడ్డా...ఓ కొత్త తరహా సినిమా. అందులో నేను పెద్ద డాన్‌ని. తమాషాగా ఉంటూనే సీరియస్‌గా సాగుతుంది అన్నారు.అలాగే అలాగే ఈ సినిమా చేయడానికి చాలా విషయాలు నన్ను పురిగొల్పాయి. కేవలం నా ఒక్క పాత్ర కోసమే కాదు. నా చుట్టూ ఉన్న వ్యక్తుల కదలికలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. తప్పకుండా నా అభిమానులకు నచ్చుతుంది అని బిగ్‌ బి మురిసిపోతూ చెప్పుకొచ్చారు.

    English summary
    In the movie Amitabh Bachchan reprises the famous "Vijay" that he has played in popular films like Deewar, Agneepath and Zanjeer. He essays the role of a retired Hitman settled in Paris who comes back to India to do "one last job". During the course he comes face to face with his past and that gets him to change his motive for the 'hit'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X