twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెవెన్త్ సెన్స్ పై కోర్టుకు వెళతాం: బౌద్ధ గురువులు

    By Bojja Kumar
    |

    తమిళ హీరో సూర్య హీరోగా, ఎఆర్ మురుగదాస్ హీరోగా వచ్చిన సెవెన్త్ సినిమాపై కోర్టుకు వెళ్లనున్నట్లు బౌద్ధ గురువులు హెచ్చరించారు. సెవెన్త్ సెన్స్ సినిమా బౌద్ధుల ఆరాధ్యుడైన బోధి ధర్మను కించ పరిచేలా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ''సెవెన్త్ సెన్స్ సినిమా కల్పిత కథ"" అని...మీడియా ముఖంగా వివరణ ఇవ్వకపోతే దర్శక, నిర్మాతలను కోర్టుకీడుస్తామని బౌద్ధ గురువులు బాపూ, టి రఘు హెచ్చరించారు.

    ఈ చిత్రం తమిళ చరిత్రను బేస్ చేసుకుని తయారు చేసానని, తమిళలు అంతా గర్వపడతారని రిలీజుకు ముందు మురగదాస్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే సినిమాలో చూపినట్లుగా బోధిదర్మ అనే వ్యక్తి తమిళనాడు నుంచి వెళ్లలేదని, చరిత్రను సరిగ్గా తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు తీసారంటూ బౌద్ధ గురువులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా....పరిస్థితి చూస్తుంటే ప్లాప్ టాక్ తో నడుస్తున్నే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడానికి ఇలాంటి వివాదాలకు తెరలేపారని వాదించే వారూ లేక పోలేదు. మరి బౌధ్ధ గురువుల హెచ్చరికలపై సినిమా దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో? చూడాలి.

    7ఎఎమ్ అరివు పేరుతో సూర్య, శృతి హాసన్ జంటగా తమిళంలో రూపొందిన సినిమాను తెలుగులో...సెవెన్త్ సెన్స్ పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే సినిమా కథాంశం ప్రేక్షకుల అంచనాలకు తగిన విధంగా లేక పోవడం, కేవలం తమిళుల గురించి డబ్బా కొట్టుకున్నట్లు సినిమా ఉండటంతో తెలుగునాట సినిమాకు పరాజయం తప్పలేదు.

    English summary
    Buddhist priests warning to 7th Sense film makers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X