'బుజ్జిగాడు' 22న. . .

ఇందులో త్రిష అన్నగా, శివన్న అనే డాన్ పాత్రను మోహన్‌బాబు పోషించారు. ఆయన డియర్ అనే డైలాగుతో కూడిన మేనరిజమ్ తో కనపడతారుట. అలాగే ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీత దర్శకుడు.ప్రోమోలు ,పాటలు ఇప్పటికే ప్రేక్షకులలో ఆసక్తి రేపుతున్నాయి. ఇందులో రజనీకాంత్ వీరాభిమానిగా బుజ్జి అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు.ఇంతకు ముందు జగన్ డైరెక్ట్ చేసిన 'పోకిరి', 'దేశముదురు' వంటి సూపర్‌హిట్ సినిమాల రేంజిలో ఈ సినిమా కూడా వర్కవుట్ అవుతుందని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే పరాజయాల్లో ఉన్న ప్రభాస్ కెరీర్ కి కూడా ఈ చిత్రం హిట్టవటం చాలా అవసరం.


Click it and Unblock the Notifications











