బుజ్జి గాడు మేడ్ ఇన్ చెన్నై ఆడియో ఏప్రియల్ 18 న రిలీజు చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నారుట.'వర్షం 'సినిమా హిట్ పెయిర్ ప్రభాస్,త్రిష జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కె.యస్.రామారావు తన క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై రూపొందిస్తున్నారు.డా.మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాకి సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు.ఇంతకు ముందు పూరీ.. సందీప్ చౌతా కాంబినేషన్ లో నాగార్జున సూపర్ సినిమా వచ్చింది. అప్పుడు ఆ పాటలు యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి.అలాగే ఆదిత్య ద్వారా రిలీజ్ కాబోయే ఈ పాటలు కూడా కిక్కిచ్చే అవకాసం ఉంది.