twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆసక్తికరంగా "బుల్లెట్ సత్యం'' ట్రైలర్.. విడుదల చేసిన నటుడు వినోద్ కుమార్!

    |

    దేవరాజ్, సోనాక్షి వర్మ హీరో, హీరోయిన్లుగా మదుగోపు దర్శకత్వంలో దేవరాజ్ నిర్మిస్తున్న సినిమా 'బుల్లెట్ సత్యం'. లక్ష్మీ నారాయణ ప్రెజెంట్స్ సాయి తేజ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై ఈ సినిమా లోని రామసక్కని సిలక పాటతో పాటు ఇందులో ఉన్న మూడు పాటలకు యూట్యూబ్ లో చాలా మంచి వ్యూస్ రావడమే కాక ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.

    ఈ సందర్భంగా "బుల్లెట్ సత్యం" ట్రైలర్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు వినోద్ కుమార్, దర్శకుడు ప్రసాద్ వర్మ, దర్శకుడు అభిలాష్ రెడ్డి తదితర సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేయగా సీనియర్ నటుడు వినోద్ కుమార్ "బుల్లెట్ సత్యం" ట్రైలర్ ను విడుదల చేశారు.

    ఆ తర్వాత చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుడు అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుంది.దేవరాజ్ చాలా బాగా నటించాడు.ఈ నెల 10 న గ్రాండ్ గా విడుదల అవుతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇక ప్రసాద్ వర్మ మాట్లాడుతూ .. ఈ సినిమాకు టీం అంతా ఎంతో హార్డ్ వర్క్ చేశారు ట్రైలర్ బాగుంది.ఈ నెల 10 న వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు. ఇక సీనియర్ నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ బుల్లెట్ సత్యం సినిమాను అందరూ డెడికేటెడ్ తో ఒక టీం వర్క్ పని చేశారు.దేవరాజ్ కి ఇది మొదటి సినిమా అయినా హీరోగా చేస్తూ నిర్మాతగా ఈ సినిమా ఎలా తీయాలని చక్కగా ప్లాన్ చేసుకొని తీశాడు..విలేజ్ నేటివిటీ లో వస్తున్న ఈ సినిమాలో నేను పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న పాత్ర చేశాను.

    దర్శకుడు చక్కని సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకున్నారు ఇందులో ఫ్యామిలీ ఓరియెంటెడ్, పొలిటికల్ క్రైమ్, థ్రిల్లర్ ఇలా అన్ని షేడ్స్ ఉన్న డిఫ్రెంట్ సినిమా ఇది.ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. దర్శకుడు నిజామాబాద్ ను రాజమండ్రి లో అట్మాస్ఫియర్ లా చూపించాడు.ఈ నెల 10 న విడుదల అవుతున్న మా సినిమా బెస్ట్ సినిమా అవుతుంది. ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించి పెద్ద హిట్ అయ్యేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు

    హీరో, నిర్మాత దేవరాజ్ మాట్లాడుతూ వినోద్ కుమార్ గారి సీతారత్నం గారి అబ్బాయి, మామగారు వంటి సినిమాలు ఇప్పటికీ ఫేవరేట్ గా నిలిచాయి.తను ఈ సినిమాలో నటించడం మాకు పెద్ద అసెట్ అని, ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.ఇందులో ఉన్న అన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ఈ నెల 10 న గ్రాండ్ గా విడుదల అవుతున్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించి నన్ను మా టీంని ఆశీర్వదించి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

    bullet satyam movie trailer released by vinod kumar

    చిత్ర దర్శకుడు మధు గోపు మాట్లాడుతూ ..ఇది పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇది.ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక విలేజ్ లో ఉండే ఎంపీటీసీ ఆలోచనలు ఎలా ఉంటాయి. అక్కడ ఎంపిటిసి పోస్ట్ కోసం వారు ఎలా పరితపిస్తారు.ఆ ఎంపిటిసి అవ్వడం కోసం తన లైఫ్ లో ఏం కోల్పోయాడు. ఎవరితో తలపడాల్సి వచ్చింది అనేది కథ అని అన్నారు.

    English summary
    bullet satyam movie trailer released by vinod kumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X