»   » "బమ్ డమ్" ట్రైలర్ విడుదల

"బమ్ డమ్" ట్రైలర్ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌లో లీడింగ్ ఫిలిం ఇనిస్టిట్యూట్ గా పేరు గడించి, ఇటీవల ప్రముఖ క్రికెటర్ జవగల్ శ్రీనాద్ చేతుల మీదుగా "బెస్ట్ ఫిలిం ఇనిస్టిట్యూట్" అవార్డ్ అందుకొన్న గ్లిట్టర్స్ ఫిలిం అకాడమీ తెలుగు మరియు హిందీ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం "బమ్ డమ్".

తుషార్ గౌతమ్, హర్షకుమార్,వెర్టికా గుప్తా, రాహుల్ జాంబార్డ్, వంశీరావు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి దీపక్ బల్ దేవ్ దర్శకుడు. శ్రీమతి & శ్రీ ప్రకాష్ ఠాకూర్ సమర్పణ. ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు మరియు ఈ చిత్రంలో వివిధ పాత్రల్లు పోషించిన నటీనటులు అందరూ కొత్తవారే కావడం గమనార్హం. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ ధియేటర్ లో జరిగింది.

Bum Dum trailer

ప్రఖ్యాత దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రముఖ దర్శకులు శివనాగేశ్వర్రావు, అజయ్ భుయాన్ (నాగచైతన్య "దడ" ఫేం) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ట్రైలర్ ప్రదర్శన అనంతరం ఫిలిం ఇనిస్టిట్యూట్ లో వివిధ శాఖల్లో శిక్షణ పొందిన విద్యార్ధినీ విద్యార్ధులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేసారు. గ్లిట్టర్స్ ఫిలిం అకాడమీని ఎంతో ప్రతిష్టాత్మకంగా, హైదరాబాద్ కు గర్వకారణంగా నిర్వహిస్తున్న దీపక్- "బమ్ డమ్" చిత్రంలో సినిమా నిర్మాణరంగంలోకి అడుగు పెడుతుండడం ఆనందదాయకమని అతిధులు పేర్కొన్నారు. "బమ్ డమ్" చిత్రాన్ని అతి త్వరలో హిందీ మరియు తెలుగు భాషల్లో విడుదల చేయనున్నామని దర్శకులు దీపక్ బల్ దేవ్ అన్నారు.

English summary
Bum Dum trailer. directed by deepak Baldev. produced by Glitters Film Academy. music by K.c. Mouli . starring: Tushar Goutam, Harsha kumar, Vertika Gupta, Rahul Jambard & Vasirao.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu