దేవదాస్ శాటిలైట్ ధర పేలిందిగా.. నాగ్, నాని స్టామినా!
Recommended Video

నేచురల్ స్టార్ నాని, కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం దేవదాస్. నాగార్జున, నాని నటిస్తున్న ఈ సి మల్టీస్టారర్ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.నాగ్, నాని మధ్య వినోదాత్మక సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయని సమాచారం. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజగా ఈ చిత్ర శాటిలైట్ హక్కులకు సంబందించిన వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

15 కోట్లు
నాగార్జున, నానికి ఉన్న క్రేజ్ తో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే ఈ చిత్ర శాటిలైట్ హక్కుల ధర బాంబులా పేలింది. ఈ చిత్రానికి శాటిలైట్ హక్కుల రూపంలో 15 కోట్ల ఆఫర్ లభించినట్లు తెలుస్తోంది. ఇది నిజంగా సంచలనమే.

విడుదలకు
శాటిలైట్ హక్కులే 15 కోట్లకు పైనే పలుకుతుంటే ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతుందని అంటున్నారు. ఈ లెక్కన దేవదాస్ చిత్రం విడుదలకు ముందే లాభాల్లోకి వెళ్ళినట్లే అని అంటున్నారు.

అశ్వినీదత్
ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడుదలైన తొలి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

హీరోయిన్లు
నాగార్జున సరసన ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ నటిస్తోంది. ఇక నాని సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన నటిస్తోంది. సెప్టెంబర్ నెలాఖరున ఈ చిత్రాన్ని విడుదుల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











