Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
‘బంపర్ ఆఫర్’ దర్శకుడు నెక్ట్స్ చిత్రం ఖరారు
హైదరాబాద్: దాదాపు మూడేళ్ల క్రిందట 'బంపర్ ఆఫర్' చిత్రంతో మన ముందుకు వచ్చిన దర్శకుడు జయ రవీంద్ర. సాయి రామ్ శంకర్ హీరోగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయమే సాధించింది. అయితే ఎందుకనో జయరవీంద్రకు ఆఫర్స్ రాలేదు. ఆ హిట్ ని జయ రవీంద్ర క్యాష్ చేసుకోలేక పోయారు. తాజాగా ఆయన మరో చిత్రం కమిటయ్యారు. అయితే ఈ సారి కూడా సాయిరామ్ శంకర్ నే డైరక్ట్ చేయబోతున్నారు. ఈ కాంబినేషన్ భాక్సాఫీస్ వద్ద క్రేజ్ తెస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీ సౌధామిని క్రియేషన్స్ పతాకంపై కేవీవీ సత్యనారాయణ సమర్పణలో కె.వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది..
పస్తుతం సాయిరామ్ శంకర్... 'యమహో యమః' చిత్రంలో హీరోగా చేస్తున్నారు. మనకు ఉన్నట్టుగానే అమెరికా వాళ్లక్కూడా యముడు ఉంటాడా? ఆ సంగతి తెలియదు కానీ, మన యముడు అమెరికాలో సందడి చేస్తే ఎలా ఉంటుంది? ఇంతకూ మన యముడికి అమెరికాలో ఏం పని? సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే తమ 'యమహో యమః' చిత్రం అంటున్నారు దర్శకుడు జితేందర్ వై.శ్రీహరి, సాయిరామ్‌శంకర్, పార్వతీమెల్టన్ కాంబినేషన్లో విజయ్‌కుమార్‌గౌడ్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
ఆ చిత్రంలో సాయిరామ్ క్యారెక్టర్ గురించి దర్శకుడు జితేందర్.వై మాట్లాడుతూ... పొద్దున లేవగానే రామా.. కృష్ణా... అని తలచుకొనే భక్తుల్ని చూశాం. శివుడికీ, శ్రీ వెంకటేశ్వరస్వామికీ దండం పెట్టుకొనేవాళ్లనీ చూస్తుంటాం. కానీ ఓ యువకుడు మాత్రం నిత్యం యమనామ జపం చేస్తుంటాడు. యమధర్మరాజుకి అపరభక్తుడిగా మారిన ఆ యువకుడి కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. అలాగే... ఒక యమభక్తుడు సృష్టించే సందడితో ఆద్యంతం సరదాగా సాగే చిత్రమిది. యమధర్మరాజు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే విషయాన్ని తెరపైనే చూడాలి. వినోదం, భావోద్వేగాల మేళవింపుతో కథ సాగుతుంది. యమధర్మరాజుగా శ్రీహరి నటన ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు.
ఈ చిత్రానికి రచన: వెలిగొండ శ్రీనివాస్, కెమెరా: ఆర్.జనార్థన్, కొరియోగ్రఫి: ప్రేమ్ రక్షిత్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: సాయి, నిర్మాత: జి.విజయ్‌కుమార్ గౌడ్, లైన్ ప్రొడ్యూసర్స్: అమీషా ఎంటర్టైన్మెంట్స్, నిర్మాణం: జి.వి.కె. ఆర్ట్స్.