twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రమణమ్మే పూరీ జగన్నాధ్ ని సేవ్ చేసిందా

    By Srikanya
    |

    పూరీ జగన్నాధ్ కథ, మాటలు అందించిన బంపర్ ఆఫర్ చిత్రంలో రమణమ్మ పాటే ఆ చిత్రానికి సేవర్ గా మారిందని టాక్ వినపడుతోంది. రఘ కుంచె ట్యూన్ చేసిన ఈ సాంగ్ బ్యాచులర్స్ నోళ్ళలో నానటమే ప్లస్ పాయింట్ అంటున్నారు. అలాగే పాటలో ఆర్దిక మాధ్యం, సాఫ్ట్ వేర్ పింక్ స్లిప్ ల గురించి, కుర్రకారు లైఫ్ స్టైయిల్ ని ప్రస్ధావించటం వారిని టచ్ చేసి ఆ పాటను విజువల్ గా తెరపై చూద్దామని ధియోటర్స్ కు లాగుతోందని చెపుతున్నారు. ఆడియో రిలీజ్ నాటి నుంచీ రేడియో ఎఫ్ ఎమ్ లలో నిరంతరం వినపడుతూ బాగా పాపులర్ అయి సినిమాపై క్రేజ్ తెచ్చింది. అయితే కథ పాయింట్ కాస్త విచిత్రంగా ఉండటం జనాలకి పట్టడం లేదంటున్నారు. లేకపోతే పూరీ డైలాగులకు, ఆ పాటకు సినిమా ఎక్కడికో వెళ్ళేదని వినపడుతోంది. ఇక ఈ చిత్రం ద్వారా ప్లస్ అయింది బిందు మాధవికి మాత్రమే. ఆమెకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అయితే హీరోగా చేసిన సాయిరామ్ శంకర్ కి మాత్రం ఏమీ ప్లస్ కాలేకపోవటం జరిగింది. ఇక ఈ చిత్రం దర్శకుడు గురించి అయితే మాట్లాడేవాళ్లే కరువు అయ్యారు. ఏదైమైనా సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోకుండా రమణమ్మే సేవ్ చేసింది అన్నది మాత్రం నిర్వివాదాంశం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X