‘బంపర్ ఆఫర్’ ట్రిపుల్ ప్లాటినం డిస్క్
సాయిరాం శంకర్, బిందుమాధవి జంటగా వైష్ణో అకాడమీ పతాకంపై జయరవీంద్ర దర్శకత్వంలో పూరి జగన్నాథ్ నిర్మించిన 'బంపర్ ఆఫర్' ఇటీవలై విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీనికి రఘుకుంచె సంగీతం అందించారు. పూరి సంగీత్ ద్వారా ఆడియో విడుదలైన 'బంపర్‌ఆఫర్' ఆడియోకి మంచి స్పందన లభించడంతో అమ్మకాల్లో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ సాధించింది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ సుదర్శన్ ధియేటర్‌లో డిస్క్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాథ్, సాయిరాం శంకర్, బిందుమాధవి, దర్శకుడు జయరవీంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శంకరగణేష్, రఘుకుంచే, రచయిత భాస్కరభట్ల రవికుమార్, కెమెరామెన్ సాయిశ్రీరామ్, సురేష్ ఫిల్మ్ డిస్ట్రీబ్యూటర్ సత్యనారాయణ, సుదర్శన్ ధియేటర్ అధినేత లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడు తూ 'వంద సినిమాలు విడుదలైతే వాటిలో కేవలం ఐదు మాత్రమే విజయం సాధిస్తున్నాయి. ఆ ఐదులో మా 'బంపర్ ఆఫర్' ఉండడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం హిట్ కావడంతో మా సాయికి, హీరోయిన్ బిందుమాధవికి మంచి పేరొచ్చింది. హిట్ చిత్రాన్ని తీసిన దర్శకుడు జయరవీంద్రకు చాలా చాలా థ్యాంక్స్' అని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు రఘుకుంచె మాట్లాడుతూ 'ఆడియోతో పాటుగా సినిమాను ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను' ముఖ్యంగా 'రవణమ్మ...." పాట చిత్రానికి గ్రాండ్ ఓపెనింగ్స్ ని తెచ్చింది అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించినందుకు పూరిగారికి థ్యాంక్స్ అన్నారు జయరవీంద్ర.. హీరోయిన్ బిందు మాధవి మాట్లాడుతూ 'బంపర్ ఆఫర్" చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన జగన్ గారికి, డైరెక్టర్ జయరవీంద్ర గారికి థ్యాంక్స్" అంటూ చిత్రంలోని డైలాగ్ ను చెప్పి ప్రేక్షకులను అలరించారు.ఇంకా ఈ కార్యక్రమంలో భాస్కరభట్ల, సాయిరాం శంకర్, తదితరులు తమ స్పందన తెలియజేశారు.


Click it and Unblock the Notifications











