»   » అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్ 100% లవ్ తో...

అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్ 100% లవ్ తో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

గీతా ఆర్ట్స్ బ్యానర్ కు ముఖ్య వారసుడు అల్లు అర్జున్ అన్న విషయం తెలిసిందే. ఆ విషయం అందరికీ స్ఫష్టంగా తెలియజేస్తూ..'మగధీర" అనంతరం గీతా ఆర్ట్స్ పై నిర్మితమవుతున్న '100% లవ్" చిత్రం ఆడియోను అల్లు అర్జున్ జన్మదినం రోజున విడుదల చేస్తున్నారు. అల్లు అర్జున్ అలియాస్ బన్నీకి అత్యంత ప్రియమైన మిత్రుడు, వాసు అనే తన పేరుకు ముందు బన్నీని జత చేసుకుని 'బన్నీవాసు" అని పిలిపించుకునే వ్యక్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

గీతా ఆర్ట్స్ వంటి సుప్రసిద్ద నిర్మాణ సంస్థ నిర్మించే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే సువర్ణావకాశం తనకు తన బన్నీ వల్లే వచ్చింది కాబట్టి ..'100%లవ్" చిత్రం ఆడియో బన్నీ బర్త్ డే రోజు విడుదల చేయాలని బన్నివాసు పట్టు బట్టాడని, ఆరోజు ఆ వేదికపై బన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ చేయాలని బన్నీవాసు ఏర్సాట్లు చేసుకుంటున్నాడని తెలుస్తోంది. '100% లవ్" దర్శకుడు సుకుమార్ ఇంతకుముందు దర్శకత్వం వహించిన మూడు చిత్రాల్లో రెండు చిత్రాలు అల్లు అర్జున్ నటించినవే కావడం వలన కూడా బన్నీ బర్త్ డే రోజు '100% లవ్" ఆడియో విడుదల కానుండడం ప్రాధాన్యతను సంతరించుకోనున్నది.

English summary
The audio of young hero Naga Chaitanya’s latest film ‘100% Love’ will be released on 8th of April. Music is composed by Devi Sri Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu