బన్నీ, దేవిశ్రీప్రసాద్ కామెడీ ఇలా(వీడియో)

By Srikanya

హైదరాబాద్ :దేవిశ్రీ ప్రసాద్‌ ఎప్పట్లా.. ఎనర్జీతో నింపేశాడు. తన ఆటపాటలతో అలరించాడు. దేవిశ్రీ పాటలకు బన్నీ, రవితేజ వేదికలెక్కి చిందులేశారు. ముఖ్యంగా బన్నీ, దేవిశ్రీప్రసాద్ ల మధ్య జరిగిన కామెడీ కాన్వర్షేషన్ అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇద్దరమ్మాయిల చిత్రం నాటి సంగతులను గుర్తుచేస్తూ బన్నీ మాట్లాడారు.. వారు ఏం మాట్లాడుకున్నారో చూడాలని ఉంటే....

హుద్‌ హుద్‌ తుపాను బాధితుల కన్నీటిని తుడవడమే లక్ష్యంగా చలన చిత్ర పరిశ్రమ అంతా ఒక తాటిపైకి వచ్చింది. మీకు అండగా మేమున్నాం... మీ పెదాలపై మేం చిరునవ్వుని అవుతాం అంటూ భరోసానిచ్చింది. ఉదయం 10 గంటలకు మేముసైతం... అంటూ పి.సుశీల బృందం పాడిన పాటతో వినోద కార్యక్రమాలు మొదలయ్యాయి.

ఆ తర్వాత పాటలు, డ్యాన్సులు, కబడ్డీ, ముఖాముఖి, క్రికెట్టు, తంబోలా, అంత్యాక్షరి కార్యక్రమాలు సందడిగా సాగాయి. చిన్న పెద్ద, నాయకానాయికలు అనే తేడా లేకుండా నటీనటులంతా అందరూ కలిసిపోయి ప్రేక్షకులకు వినోదాలు పంచే ప్రయత్నం చేశారు. చిత్ర పరిశ్రమ అంతా ఒక వేదికపై కనిపించడంతో ప్రేక్షకులు పులకరించిపోయారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ దాతలు స్పందించి విరాళాలు ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్‌ సంఘంతో పాటు పలువురు నటీనటులు హుద్‌ హుద్‌ బాధితుల సహాయార్థం విరాళాన్ని ప్రకటించారు.

Bunny & DSP Comedy On Stage At Memu Saitam

దాసరి మాట్లాడుతూ...'పరిశ్రమకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించి పైకి తీసుకొచ్చినవాళ్లు ప్రేక్షకులు. అలాంటివారికి కష్టాలు వచ్చినప్పుడు మేము సైతం ఏదో ఒకటి చేయాలని చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. రూపాయి అని కాదు, కోటి రూపాయలు అని కాదు కష్టంలో ఉన్నప్పుడు మేమున్నాం అని ఇచ్చే భరోసా, స్ఫూర్తికోసమే ఈ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల సమయంలో సినిమావాళ్లు వేరు వేరు అని ప్రచారం చేస్తుంటారు. అది నిజం కాదు. తెర ఉన్నంతవరకు సినిమా పరిశ్రమ ఒక్కటే. ఈ స్ఫూర్తి రాబోయే తరమూ కొనసాగించాలి. ఇలాంటి విపత్తులు రాకూడదని మనమంతా కోరుకొందాం'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X