అల్లు అర్జున్ హ్యాపీ: కేక అంటూ ఫ్యాన్స్ హంగామా
గురువారం విడుదలైన అల్లు అర్జున్ చిత్రం జులాయి సూపర్ హిట్ అంటూ అభిమానులు హంగామా చేస్తున్నారు. చిత్రం సూపర్‌గా ఉందని, హండ్రెడ్ డేస్ పక్కా అంటూ కేరింతలు కొడుతున్నారు. హీరో అల్లు అర్జున్ కూడా ఈ రోజు చిత్రం విడుదలకు ముందు ఆనందంగా ఉన్నారు. చిత్రం ఘన విజయంపై ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన భావించినట్లుగానే చిత్రం హిట్ అంటుండటంతో ఆయన మరింత హ్యాపీగా ఉన్నారట.
జులాయి చిత్రంపై ఇప్పటి వరకు ఎక్కడా డివైడ్ టాక్ రాలేదు. అల్లు అర్జున్ రవి పాత్రలో చాలా ఈజీ ప్రదర్శించారని ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అలాగే మధు పాత్రలో నటించిన ఇలియానా గ్లామర్ కనిపించింది. బిట్టూ పాత్రలో నటించిన సోనూ సూద్ పాత్ర రొటీన్ వలే ఉన్నప్పటికీ ఆకట్టుకున్నారు. ఇప్పటికే పాటలు హిట్ అయ్యాయి. అల్లు అర్జున్‌కు చాన్నాళ్ల తర్వాత మంచి హిట్ వచ్చిందని అంటున్నారు.
ఎనర్జిటిక్ అంటేనే అల్లు అర్జున్. ఈ సినిమాలోను బన్నీ మంచి ఎనర్జిటిక్‌గా నటించారు. డ్యాన్స్ కూడా అదరగొట్టాడు. అయితే అతని పాత్ర మాత్రం అతనిలోని పూర్తి నటనను బయటకు తీసుకు వచ్చేలా లేదని చెప్పవచ్చు. గ్లామర్‌గా కనిపించిన ఇలియానాకు నటనకు స్కోప్ కనిపించలేదు.
బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్.
నటీనటులు: అల్లు అర్జున్, ఇలియానా, రాజేంద్రప్రసాద్, సోనూసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, బ్రహ్మాజీ, తులసి, హేమ, ప్రగతి తదితరులు.
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కెమెరా: ఛోటా కె.నాయుడు,శ్యామ్ కె.నాయుడు
ఆర్ట్: రవీందర్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ


Click it and Unblock the Notifications











