స్పెయిన్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్
హైదరాబాద్ : 'జులాయి' చిత్రం భారీ విజయం సాధించడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ హ్యీపీగా ఉన్నాడు. నిన్నమొన్నటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడిపిన బన్నీ తాజాగా భార్య స్నేహారెడ్డితో కలిసి కొన్ని రోజులు హాలిడే ఎంజాయ్ చేసేందుకు స్పెయిన్ వెళ్లాడు. తిరిగి సెప్టెంబర్ మొదటి వారంలో సిటీకి చేరుకుంటాడు.
తిరిగి వచ్చిన తర్వాత బన్నీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందబోయే తన తర్వాతి చిత్రంతో బిజీ కాబోతున్నాడు. అల్లు అర్జున్,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న 'ఇద్దరు అమ్మాయిలతో..' చిత్రం సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
'జులాయి' వివరాల్లోకి వెళితే...ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ హిట్‌గా నిలిచింది. కేవలం రెండు వారాల్లోనే దాదాపు రూ. 40 కోట్లు వసూలు చేసి బన్నీ మార్కెట్ రేంజ్ ఏమిటో చాటింది. ఏపీతో పాటు ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియాలో జులాయి చిత్రం తన సత్తా చాటింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ఎన్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ బ్యాంకు దోపిడీ సంఘటన చుట్టూ సాగే ఈ చిత్రంలో బన్నీ అద్భుతంగా నటించడంతో పాటు యాక్షన్ సీన్లు ఇరగదీశాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్లస్సయింది. జులాయి మలయాళ వెర్షన్ 'గజ పోకిరి' ఈనెల ఓనం పండుగ సందర్భంగా 18న విడుదల చేయగా మలయాళ ప్రేక్షకులు ఈచిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.


Click it and Unblock the Notifications











