'ఇద్దరు అమ్మాయిలతో....' క్రేజీగా బన్నీ ఇలా (కొత్త ఫోటోలు)
హైదరాబాద్ : బన్నీ ఎక్కడుంటే అక్కడ అల్లరే. ఈ దేశముదురు , పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందతున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులలో చాలా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్,గెటప్స్ దగ్గరనుంచి విభిన్నత చూపించాడనే వార్త ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా చేస్తోంది.
ఈ నేఫధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన ఫోటోలు ఇప్పుడు నెట్ లో విడుదల అయ్యి ఓ రేంజిలో సర్కులేట్ అవుతున్నాయి. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో వీటికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రం టీజర్ విడుదల తేదీ ఖరారైంది. అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రియల్ 18న ఈ టీజర్ ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం స్పానిష్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుంది.
సినిమా స్టోరీలైన్ విషయానికొస్తే.... ఒకే కుర్రాడు ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని టాక్. 'ఇడియట్', 'దేశముదురు' తరవాత ఓ పూర్తిస్థాయి ప్రేమ కథని తెరపై చూపిస్తున్నారు పూరి. అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో ఐటం బాంబ్ గా..బాలీవుడ్ నటి దేవషి కందూరిని ఎంపిక చేసారు. ఆమెపై స్పెషల్ గా రీసెంట్ గా స్పెయిన్ లో ఓ పాటను చిత్రీకరించారు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ సినిమాకు హైలెట్ అవుతుందని చెప్తున్నారు.

అల్లు అర్జున్ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తూండటంతో ఓ రేంజిలో ఆడియోపై అంచనాలు ఉన్నాయి.

ఇప్పటివరకూ అల్లు అర్జున్ చేసిన సినిమాల్లో ఒక్కరే హీరోయిన్ గా ఉంటూ వచ్చారు. తొలిసారిగా అల్లు అర్జున్ సరసన ఇద్దరు హీరోయిన్స్ చేస్తూండటం కూడా హైలెటే.

గతంలో అల్లు అర్జున్, పూరీల కలయికలో 'దేశముదురు' వంటి హిట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఈ తాజా చిత్రంపై ప్రారంభానికి ముందే భారీ అంచనాలు మొదలయ్యాయి.

థాయ్ ఫైట్ మాస్టర్ కెచే కంపక్డీ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ కానున్నాయి.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.


Click it and Unblock the Notifications











