బన్నీ షాకింగ్ నిర్ణయం: మెగా హీరోలతో మీటింగ్.. ఆ ఇద్దరికీ క్లాస్ తీసుకోబోతున్నాడా?

Recommended Video

Mega Hero's clashes, Allu Arjun takes lead

ఇండస్ట్రీలో మాకు మేమే పోటీ అన్నట్టుగా ఉండే మెగా ఫ్యామిలీ.. మెగా వారసుల మధ్య ఫైట్ చూసి కాస్త కలవరపడుతోంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఇద్దరు యువ మెగా హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సిద్దమవడం అభిమానుల్లోకి ప్రతికూల సంకేతాలు తీసుకెళ్తాయని భావిస్తోంది. ఫైట్ ఉంటే వేరే హీరోలతో ఉండాలే తప్ప.. మెగా హీరోల మధ్య క్లాషెస్ ఉండవద్దని ఆ కుటుంబం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బన్నీ చొరవ తీసుకుని త్వరలోనే ఓ మీటింగ్ పెట్టబోతున్నాడని ప్రచారం జరుగుతోంది..

అభిమానుల సపోర్ట్ చీలిపోతుందని..:

అభిమానుల సపోర్ట్ చీలిపోతుందని..:

మెగా హీరోలు తమలో తామే పోటీ పడితే.. భవిష్యత్తులో ఒకరితో మరొకరికి విభేదాలు తలెత్తే అవకాశం ఉందని మెగా ఫ్యామిలీ భావిస్తోందట. పైగా మెగా అభిమానుల సపోర్ట్ కూడా హీరోల మధ్య చీలిపోయే అవకాశముందని, అలా జరిగితే ఆయా హీరోల మార్కెట్ దెబ్బతింటుందనే ఆలోచనలో పడ్డారట. ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టడానికే బన్నీ లీడ్ తీసుకుని ముందుకొచ్చినట్లు చెబుతున్నారు.

బన్నీ ఏం చేయబోతున్నారు?:

బన్నీ ఏం చేయబోతున్నారు?:

మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల విడుదల మధ్య కనీసం మూడు, నాలుగు వారాలు గ్యాప్ ఉండేది. అలాంటిది ఇప్పుడు వరుణ్ తేజ్-సాయిధరమ్ తేజ్ సినిమాలు ఒకేసారి విడుదలవుతుండటం వారిలో టెన్షన్ పెంచుతోంది. ఇకముందు ఇలా మెగా హీరోల సినిమాల మధ్య క్లాషెస్ లేకుండా చూడటానికి బన్నీ ఓ మీటింగ్ పెట్టబోతున్నాడట.

ఆ ఇద్దరికీ క్లాస్ తీసుకుంటాడా?:

ఆ ఇద్దరికీ క్లాస్ తీసుకుంటాడా?:

తాను నిర్వహించబోయే మీటింగ్‌కు మెగా హీరోలందరిని ఆహ్వానిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ముందు మెగా హీరోలెవరూ తమలో తామే పోటీకి సిద్దపడవద్దని బన్నీ గట్టిగా చెప్పనున్నాడట. అంటే, ఒకవిధంగా సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లకు క్లాస్ తీసుకోబోతున్నాడా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినా నిర్మాతల మధ్య సయోధ్య కుదరనప్పుడు హీరోలు మాత్రం ఏం చేస్తారు?..

ఇంటిలిజెంట్ వర్సెస్ తొలిప్రేమ:

ఇంటిలిజెంట్ వర్సెస్ తొలిప్రేమ:


కేవలం ఒకరోజు వ్యవధిలో ఇంటిలిజెంట్, తొలిప్రేమ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మెగా అభిమానుల పుణ్యమాని ఈ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. కానీ రెండింటిలో ఏ సినిమాకు కాస్త నెగటివ్ టాక్ వచ్చినా.. ఇక ఆ సినిమా ఎగిరిపోయినట్లే. అదే పోటీ లేకుండా గనుక విడుదలైతే.. యావరేజ్ గా ఉన్నా ఎలాగోలా నెట్టుకురావచ్చు. ఇప్పుడు బన్నీ కూడా మెగా హీరోలకు ఇదే ఫార్మూలను హితబోధ చేయబోతున్నాడట.

ఫిబ్రవరి 9,10తేదీల్లో..:

ఫిబ్రవరి 9,10తేదీల్లో..:

ఇంటిలిజెంట్, తొలిప్రేమ ఫిబ్రవరి 9,10తేదీల్లో విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇండస్ట్రీ బజ్ ప్రకారం తొలిప్రేమ మీద కాస్త ఎక్కువ అంచనాలే ఉన్నాయి. ఇంటిలిజెంట్ విషయంలో మంచి అంచనాలే ఉన్నప్పటికీ.. ఎందుకనో ప్రచార చిత్రాలు అంతగా ఆకట్టుకోవడం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. చూడాలి మరి ఫైనల్‌గా ఈ పోటీలో గెలిచే మెగా హీరో ఎవరో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X