twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని స్థానంలో బన్ని, టాలెంటెడ్ డైరెక్టర్ తో సినిమా!

    |

    అల్లు అర్జున్ తాజాగా మరో చిత్రం కథని ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. అక్కినేని కుటుంబ హీరోలతో మనం, హలో సినిమాలు రూపొందించిన విక్రమ్ కుమార్ రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసి ఓ స్టోరిని వినిపించాడని సమాచారం. కథ నచ్చి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించబోతున్నాడు.

    ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్, పాటలు ఆకర్షనీయంగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. నా పేరు సూర్య విడుదల తరువాత విక్రమ్ కుమార్ సినిమాను ప్రకటించే అవకాశం ఉంది.

    bunny in nani place, talented director to direct this film!

    హలో సినిమా తరువాత విక్రమ్ కుమార్ నానితో ఒక సినిమా చెయ్యాలి, కాని ఆ సినిమా ఉండబోదని సమాచారం. నాని స్థానంలో బన్ని వచ్చినట్లు తెలుస్తోంది. విక్రమ్ కుమార్ ప్రస్తుతం బన్ని స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్లు సమాచారం. డిఫరెంట్ సినిమాలు చేసే విక్రమ్ కుమార్ బన్నిని ఎలా చూపిస్తాడో చూడాలి.

    English summary
    Allu Arjun has been in talks with sensible director Vikram K Kumar and locked him for his next. Official news about this film made very soon. Bunny recent film Naa peru suriya getting release this friday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X