twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మతిపోగొడుతున్న బన్నీ న్యూ గెస్ట్‌హౌస్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లైఫ్‌ను మరింత లగ్జరీగా గడిపేందుకు అన్ని హంగుళతో కూడిన గెస్ట్ హౌస్‌ను నిర్మించుకుంటున్నాడు. గచ్చిబౌలిలోని విప్రో జంక్షన్లో నిర్మాణం అవుతున్న ఈ గెస్ట్ హౌస్ ఇంటర్నేషనల్ స్టాండర్స్, అత్యాధునిక ఆర్కిటెక్చర్‌‍తో నిర్మిస్తున్నారు.

    ఈ గెస్ట్ హైస్‌లో విశాలమైన స్విమ్మింగ్ ఫూల్ తదితర ఏర్పాట్లతో పాటు ఓపెన్ రూఫ్ ఉన్న బెడ్ రూమ్‌ను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. బెడ్ రూమ్ నుంచి నేరుగా ఆకాశంలో చుక్కలను చూస్తూ కబుర్లు చెప్పుకోవచ్చన్నమాట. అదే విధంగా స్నేహితులు, బంధువులతో కలిసి పార్టీలు చేసుకోవడాని బెస్ట్ ప్లేసుగా దీన్ని తీర్చి దిద్దుతున్నారు. ఈ ఇంటి కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారట. పుట్టుకతోనే చాలా రిచ్ అయిన బన్నీకి ఇలాంటి ఇల్లు నిర్మించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

    బన్నీ ఇటీవల నటించిన 'జులాయి' చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇలియానా హీరోయిన్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ పూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.

    English summary
    Stylish star Allu Arjun got a new place to relax and also to hang out with friends. It’s his new guest-house built at At Jawaharlal Nehru Outer Ring Road ORR Gachibowli (near Wipro junction) Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X