బన్నీ 'ఇద్దరు అమ్మాయిలతో..' షూటింగ్ మొత్తం...
హైదరాబాద్: అల్లు అర్జున్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న 'ఇద్దరు అమ్మాయిలతో..'చిత్రం షూటింగ్ మొత్తం అబ్రాడ్ లో జరపనున్నట్లు పూరీ జగన్నాధ్ తెలియచేసారు. బ్యాంకాక్ లో షూటింగ్ మొదలయ్యి అమెరికాలో జరగనుందని తెలుస్తోంది. దేశముదురు కాంబినేషన్ అల్లు అర్జున్,పూరీ జగన్నాధ్ ని రిపీట్ చేస్తూ బండ్ల గణేష్ రూపొందించే ఈ చిత్రం బారీగా రూపొందనుంది. సెప్టెంబర్ 20న బ్యాంకాక్ లో షూటింగ్ ప్రారంభం కానుంది.. హీరోయిన్స్ సెంట్రల్ గా నడిచే కధ కాబట్టి ఆ టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో చేసే ఇద్దరు హీరోయిన్స్ లో తాప్సీ ని ఎంపికచేసారు. మరొకరు కోసం చూస్తున్నారు.
2013 జనవరికి విడుదల అయ్యే ఈ చిత్రం కథ కేవలం ట్రీట్ మెంట్ బేసెడ్ గా నడుస్తుందిని సమాచారం. ఇందులో బన్ని సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఇద్దరు అమ్మాయిలతో అల్లు అర్జున్ చేసే అల్లరినే ప్రత్యేకంగా ఫన్ తో కలిసి పూరీ స్క్రిప్టు రెడీ చేసాడని ఫిల్మ్ నగర్ సమాచారం. దాదాపు పెద్ద హీరోలందరూ చేసిన ఈ ఫార్ములా ఈ మధ్య కాలంలో ఎవరూ టచ్ చేయటం లేదు. దాంతో పూరీ ఈ పాయింట్ నే తన దైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చి రెడీ చేసి,బన్ని కి వినిపించి డేట్స్ ఓకే చేయించుకున్నారు.
ఇప్పటివరకూ అల్లు అర్జున్ చేసిన సినిమాల్లో ఒక్కరే హీరోయిన్ గా ఉంటూ వచ్చారు. తొలిసారిగా అల్లు అర్జున్ సరసన ఇద్దరు హీరోయిన్స్ చేస్తున్నారు. 'ఇద్దరు అమ్మాయిలతో' చిత్రం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో అందులోని కథానాయికలు ఎవరై ఉంటారన్న అంశం ఆసక్తికరంగా మారింది. టైటిల్‌కు తగ్గట్టుగా ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారన్న విషయం వేరుగా చెప్పనక్కరలేదు. అయితే చిత్ర సంబంధీకులు ఎవరూ ధృవీకరించకపోయినప్పటికీ, ఇందులో ఒక హీరోయిన్‌గా శృతిహాసన్ పేరు బలంగా వినిపించింది. అయితే తాను ఆ చిత్రం చెయ్యడంలేదని ఆమె అంటోందట. మంచి కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రాన్ని ఆమె అంగీకరించలేకపోవడానికి బిజీగా ఉండటమే కారణమని వినిపిస్తోంది. కాగా ఆమెకు బదులుగా వేరొక హీరోయిన్‌ను ఎవరిని ఎంపిక చేస్తారోనని పరిశ్రమలో అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా తాప్సీని ఎంపికచేశారని చెప్పుకుంటున్నారు.
గతంలో అల్లు అర్జున్, పూరీల కలయికలో 'దేశముదురు' వంటి హిట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఈ తాజా చిత్రంపై ప్రారంభానికి ముందే భారీ అంచనాలు మొదలయ్యాయి. సెప్టెంబర్‌లో ప్రారంభమై, అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకుంటుందని అనధికార వార్తలు వినిపిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణష్ నిర్మించనున్నారట. లోగడ పూరీ దర్శకత్వంలో పలు చిత్రాలకు సంగీతాన్ని అందించిన చక్రికి కొంత విరామం తర్వాత మళ్లీ ఈ చిత్రానికి పనిచేసే అవకాశం లభించిందని అంటున్నారు..


Click it and Unblock the Notifications











