‘ఇద్దరమ్మాయిలతో’లో మూడో హీరోయిన్ ఈమే..(ఫోటో)

By Srikanya

హైదరాబాద్ : అల్లు అర్జున్‌ హీరోగా పరమేశ్వర ఆర్ట్‌‌స పతాకంపై పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ గా కేథరిన్, అమలాపాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ గా చేయబోతోందని తెలుస్తోంది. ఆమె పేరు కాజల్ వశిష్ట్.

కాజల్ వశిష్ట్ కి తెలుగులో ఇదే మొదటి చిత్రం. ప్రభుదేవా రౌడీ రాధోడ్ చిత్రంతో చేసిన ఆమెను పూరి తన ఈ చిత్రంలోకి తీసుకున్నారు. ఇద్దరమ్మాయిలు టీమ్ తో తను చేయటం చాలా ఆసక్తికరంగా ఉందని కాజల్ అంటోంది. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ 'తమ సంస్థ అందించిన గబ్బర్‌సింగ్‌, బాద్‌షా చిత్రాల స్థాయిలోనే ఇద్దరమ్మాయిలతో చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం బాద్‌షా బ్లాక్‌బస్టర్‌ హిట్టయిన ఆనందంలో ఉన్నామన్నారు.

స్పెయిన్‌లో ఇద్దరమ్మాయిలతో షూటింగ్‌లో ఉండగా తన పనులన్నీ అర్జునే చూసుకొని బాద్‌షా చిత్రం విడుదల చేసి బ్లాక్‌బస్టర్‌ కొట్టండి అని ఆల్‌ది బెస్ట్‌ చెప్పి పంపించాడని బండ్ల గణేశ్‌ చెప్పారు. అర్జున్‌కు ఈ చిత్రం నెంబర్‌ వన్‌ చిత్రంగా నిలుస్తుందని, మళ్లీమళ్లీ బన్నీతో సినిమాలు చేసే అవకాశం రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. బాంకాక్‌లో ఇంటర్నేషనల్‌ ఫైట్‌మాస్టర్‌ కిచ్చా డిజైన్‌ చేసిన యాక్షన్‌ పార్ట్‌ అద్భుతంగా వచ్చిందని, స్పెయిన్‌లో చిత్రీకరించిన పాట హైలెట్‌గా నిలుస్తుందని, దేవిశ్రీప్రసాద్‌ అందించిన అద్భుతమైన ఆడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన వివరించారు.

సినిమా స్టోరీలైన్ విషయానికొస్తే.... ఒకే కుర్రాడు ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని టాక్. 'ఇడియట్‌', 'దేశముదురు' తరవాత ఓ పూర్తిస్థాయి ప్రేమ కథని తెరపై చూపిస్తున్నారు పూరి. అల్లు అర్జున్ సరసన అమలాపాల్‌, కేథరీన్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X