ఛార్మినార్ దగ్గరలో బన్నీ హంగామా..

By Srikanya

హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ ఛార్మినార్ దగ్గరలో షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాకు ప్రాణమైన కొన్ని కీ సీన్స్, ఛేజ్ సీక్వెన్స్ ను ఇక్కడ తీస్తున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన రేసీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. భోజపురి హీరో రవి కిషన్ విలన్ గా చేయటం సినిమాకు బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు.

అలాగే సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న ఈ చిత్రం పిభ్రవరికి వాయిదా పడింది. ఈ కొత్త విడుదల తేదీ పిభ్రవరి 7 అని తెలుస్తోంది. ఎవడు చిత్రం సంక్రాంతికి రావటం, అలాగే పూర్తై ఫస్ట్ కాపీ పట్టటానికి ఇంకా రెండు నెలలు సమయం పట్టేటట్లు ఉందని అందుకే విడుదల ను ముందుకు నెట్టారని చెప్తున్నారు. అయితే ఫిబ్రవరి అనేది డల్ సీజన్ కాబట్టి మార్చి చివర నెలలోకి వెళ్లే అవకాసం ఉందని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు.

Bunny's Race Gurram Near Charminar.

ఇక చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నాడు. ఫన్,యాక్షన్ కలిపి మరో కిక్ లా రూపొందిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.
అలాగే "గెలుపు కోసం బరిలో దిగినవాడికి... లక్ష్యం మాత్రమే కనిపించాలి. ఎదురొస్తున్న సవాళ్లు, పరిగెట్టిస్తున్న పరిస్థితులు, చుట్టుముడుతున్న సమస్యలూ ఇవేమీ పట్టించుకోకూడదు. రేసులో నిలవాలన్నా, నిలిచి గెలవాలన్నా పోరాడాల్సిందే. ఆ యువకుడూ అదే చేశాడు. 'రేసు గుర్రం'లా దూసుకుపోయాడు. మరి విజయం అందిందా? లేదా? ఇంతకీ ఈ రేసు దేని కోసం? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే!" అన్నారు.

సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... "పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... 'రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు" అన్నారు.

కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బన్నీ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉండనుందని, కథా కథనాల పరంగా సురేందర్‌రెడ్డి గత చిత్రాలను మించేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో 'కిక్'శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.

ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది.

కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X