శృతిహాసన్ ‘రేస్ గుర్రం’ (ఆన్ లొకేషన్ ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్ : అల్లు అర్జున్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా సురేందర్ దర్శకత్వంలో 'రేస్ గుర్రం' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 2 వ తేదీ నుంచి ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ షూట్ కి సంబంధించిన మరిన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకు వచ్చాయి. శృతిహాసన్ ,అల్లు అర్జున్ పై జరుగుతున్న సీన్స్ కు సంభంధించిన ఫోటో లివి. ప్రస్తుతం షూటింగ్ యూరఫ్ జరుగుతోంది. ప్రస్తుతం మిలన్లో చిత్రీకరణ జరుగుతోంది.

దర్శకుడు సురేందర్ రెడ్డి 'రేస్ గుర్రం' చిత్రాన్ని సరికొత్త కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్నారు. బన్నీ బాడీలాంగ్వేజ్, స్టైల్‌కు తగిన విధంగా ఈచితంలో అతని పాత్రను పవర్ ఫుల్‌గా ప్లాన్ చేసారు. ఈ చిత్రం బన్నీ నటించిన గత చిత్రాలన్నింటికంటే విభిన్నంగా ఉంటుందని అంటున్నారు యూనిట్ సభ్యలు.

రేస్ గుర్రం చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి. అయితే గత చిత్రాల మాదిరి ఈచిత్రంలోనూ అల్లు అర్జున్ డాన్స్‌ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. బన్నీ వేసుకునే కాస్ట్యూమ్స్ విషయంలో చాలా మార్పులు కనిపించనున్నాయి.

స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన వివరాలు, ఫోటోలు....

మాస్ ఫిల్మ్

మాస్ ఫిల్మ్

అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా.. సలోని ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్న రేసుగుర్రం చిత్రం శర వేగంగా సిద్ధమవుతోంది. మాస్ చిత్రాలను స్టయిలిష్‌గా తీస్తాడని పేరు తెచ్చుకున్న సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రెడీ అవుతుంది.

భారీ బడ్జెట్ తో...

భారీ బడ్జెట్ తో...

లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెలలో ఈ సినిమా కోసం రెండు పాటల్ని విదేశాల్లో చిత్రీకరించారు. తాజా షెడ్యూల్ ఈ నెల 2 నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ఓ భవంతిలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

సలోని కూడా...

సలోని కూడా...

ఈ సినిమాలో ‘కిక్'శ్యామ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్యామ్‌కి జోడీగా సలోని ఎంపికయ్యారు. ఆ మధ్య ‘మర్యాద రామన్న', ‘బాడీగార్డ్' చిత్రాల్లో కనిపించిన సలోనికి చాలా విరామం తర్వాత వచ్చిన మంచి అవకాశమిది. సలోని మాట్లాడుతూ.... ''ఈ సినిమాలో నా పాత్ర పూర్తిగా సంప్రదాయబద్ధంగా సాగుతుంది. ఎక్కువ భాగం చీరకట్టులోనే కనిపిస్తా. నటనకు అస్కారం ఉన్న పాత్ర దక్కడం నా అదృష్టం'' అని చెబుతోంది సలోని. మరి ఇలాంటి పాత్రలో ఈ 'తెలుగమ్మాయి' ఎలా ఒదిగిపోతుందో చూడాలి. హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న 'తెలుగమ్మాయి' నిరాశపరిచింది. వెంకటేష్‌ సినిమా 'బాడీగార్డ్‌'లో నటించినా ఆమె పాత్రకు తగిన గుర్తింపు రాలేదు. సలోని కెరీర్‌ ఏమైపోతుందో అనుకొంటున్న దశలో ఈ అవకాశం ఆమె ముంగిట వాలింది

టైటిల్ అందుకే...

టైటిల్ అందుకే...

ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దానె్నక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని వుం టుంది. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి తన చిత్రంలో చూపబోతున్నారా అన్నట్లు అల్లు అర్జున్ తదుపరి చిత్రానికి ‘రేసు గుర్రం' అనే పేరును నిర్ణయించారు.

షెడ్యూల్..

షెడ్యూల్..

పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మీడియా కన్నును కప్పి తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. తర్వాత షెడ్యూల్‌కు నార్వే వెళ్లవచ్చారు. బన్నీ, శృతిహాసన్‌లపై రెండు పాటలను, మరికొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించుకు వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేసి, బన్నీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రం నిర్మించనున్నారని సమాచారం.

స్టైలిష్ స్టార్..

స్టైలిష్ స్టార్..

బన్నీ ఈ చిత్రంలో సరికొత్త స్టయిల్లో కనిపించనున్నారని, అతని ఆహార్యం అంతా మార్చివేసి నిర్మిస్తున్నారని వినికిడి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ రేసు గుర్రం ఇంతమంది ప్రోత్సాహంతో ఎంత బాగా పరిగెడుతుందో త్వరలో వెండి తెరపై చూద్దాం.

ఎక్సలెంట్ మ్యూజిక్..

ఎక్సలెంట్ మ్యూజిక్..

ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ ఇచ్చిన మ్యూజిక్‌పై తన అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు అల్లు అర్జున్. ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్ స్పందిస్తూ...‘రేస్ గుర్రం చిత్రం కోసం తమన్ ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చాడు. సినిమా ఆడియో విడుదల ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పాటలు సూపర్ హిట్టవడం ఖాయం' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు అల్లు అర్జున్.

కీలకం..

కీలకం..

కిక్‌తో హిట్ కొట్టి స్టార్ దర్శకుడిగా మారిన సురేందర్ రెడ్డి, ఆ తర్వాత ఊసరవెల్లితో బోల్తా పడ్డాడు. అయితే ఈచిత్రంతో ఎలాగైనా హిట్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే స్క్రిప్టు కోసం చాలా టైమ్ తీసుకుని ఈ చిత్రం ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు.

శ్యామ్ పాత్ర...

శ్యామ్ పాత్ర...

కిక్ శ్యామ్ ఈ చిత్రంలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. సలోని అతనికి జోడీగా నటిస్తోంది. శ్యామ్, అల్లు అర్జున్ మధ్య వచ్చే సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. ఈ సినిమా తన కెరీర్ కు తెలుగులో మంచి కిక్ ఇస్తుందని శ్యామ్ భావిస్తున్నాడు.

శృతి హాసన్...ఉత్సాహం

శృతి హాసన్...ఉత్సాహం

వరస హిట్స్ తో దూసుకుపోతున్న శృతిహాసన్ ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతాననే నమ్మకం పెట్టుకుంది. బలుపుతో ఆమె ఫామ్ లోకి వచ్చింది. ఈ చిత్రం మరో హిట్ తో గబ్బర్ సింగ్ లా తనకు కెరీర్ లో పెద్ద బ్రేక్ ఇస్తుందని చెప్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X