»   » బన్నీ 'రేసుగుర్రం' థియోటర్ ట్రైలర్ (వీడియో)

బన్నీ 'రేసుగుర్రం' థియోటర్ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రేసుగుర్రం'. శ్రుతిహాసన్‌ హీరోయిన్. సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం థియోటర్ ట్రైలర్ ని అల్లు అర్జున్ రాజమండ్రిలో విడుదల చేసి ఈ తేదీని ఖరారు చేసారు. ఏప్రియల్ 11 న ఈ చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలందించారు. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), డా||కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.... ''నా జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా ఇది. సురేందర్‌ రెడ్డి చాలా బాగా తీశారు. పరిశ్రమలో ప్రతి దర్శకుడు సినిమాతోపాటు నా హీరో బాగుండాలని కోరుకుంటాడు. వాళ్ల అభిరుచి వల్లే మేము తెరపై ఇంత అందంగా కనిపిస్తుంటాం. 'కిక్‌', 'బృందావనం' పాటలు విన్నాక తమన్‌తో పని చేయాలనిపించింది. ప్రపంచ స్థాయి సంగీతం తన దగ్గర ఉంటుంది.'' అన్నారు.

Bunny's Race Gurram Theatrical Trailer

సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ... ''తెరపై బన్నీ రేసుగుర్రమైతే తెరవెనుక చిత్రబృందమంతా రేసుగుర్రాల్లా పరుగెత్తి పని చేశారు. తమన్‌ తన పాటలతో నాకు రెండింతలు కిక్‌ ఇచ్చాడు. ఈ సినిమా విజయం ఎప్పుడో ఖరారైంది. ప్రజల చప్పట్ల కోసమే ఎదురు చూస్తున్నా'' అన్నారు.

కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/33pMNv6k6bA" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Allu Arjun, Shruti Haasan starrer Race Gurram is all set to hit the screens on April 11. Surender Reddy has directed this action entertainer and currently, the film is in the post-production stage.
Please Wait while comments are loading...