పూరి దర్శకత్వంలో... బన్నీ, శృతి హాసన్
పూరి జగన్నాథ్, అల్లు అర్జున్ కాంబినేసన్లో అప్పట్లో వచ్చిన 'దేశ ముదురు' చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. ప్రస్తుతం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగుతో బిజీగా గడుపుతున్న పూరి జగన్నాథ్ ఈచిత్రం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బన్నీ సరసన శృతి హాసన్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నట్లు సమాచారం.
ఈ క్రేజీ కాంబినేషన్ నిర్మాణ బాధ్యతలను గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూరి, అల్లు అర్జున్ కాంబినేషన్ కావడంతో ఇటు సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ 'జులాయి' చిత్రంలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కె. రాధకృష్ణ నిర్మాతగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బన్నీ సరసన ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ 15న హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన తమన్నా నటిస్తోంది. ఇందులో పవన్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











