త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త చిత్రం లాంచ్ డేట్

ఇక ప్రస్తుతం సంగీత చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇదివరకు 'జులాయి'కి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కబోతోంది. ఇందులో అల్లు అరవింద్ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్. కథ ఇప్పటికే సిద్ధమైందట. మరో ప్రక్క అల్లుఅర్జున్ 'రేసుగుర్రం' తుదిదశకు చేరుకొంది.
'రేసు గుర్రం' చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న ఈ చిత్రం పిభ్రవరికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే విడుదల తేదీ ని ఏప్రియల్ 4 వ తేదీకి మార్చారని తెలుస్తోంది. పూర్తై ఫస్ట్ కాపీ పట్టటానికి ఇంకా రెండు నెలలు సమయం పట్టేటట్లు ఉందని అందుకే విడుదల ను ముందుకు నెట్టారని చెప్తున్నారు. చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నాడు. ఫన్,యాక్షన్ కలిపి మరో కిక్ లా రూపొందిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











