కోట శ్రీనివాసరావుకు బన్నీ-త్రిక్రమ్ టీం సన్మానం
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ' అవార్డుకు ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు ఎంపికయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బన్నీ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగులో ఉన్నారు. ఈ నేపథ్యంలో చిత్ర టీం ఆధ్వర్యంలో ఆయనకు శాలువా కప్పి సన్మానం చేసారు. కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు. పలువురు ఆయనకు పుష్ప గుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మూడు దశాబ్దాలకుపైగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న కోట శ్రీనివాసరావు కి భారత ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు తగిన గుర్తింపు లభించిందని ఆయన సన్నిహితులు అంటున్నారు. త్వరలో ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు.
తనకు అవార్డు రావడంపై కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ...''నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చా. ఇక్కడ నిర్మాతలు, దర్శకులు అందించిన ప్రోత్సాహంతో నిలబడ్డాను. నా విజయాల వెనుక, అందుకొనే పురస్కారాల వెనుక సినీ పరిశ్రమలోని అందరి కృషి ఉంది. ఇన్నేళ్లుగా సీనీ రంగానికి నేను చేసిన సేవకు, నా నటనకు గుర్తింపుగా ప్రభుత్వం నాకీ పురస్కారం అందించిందని భావిస్తున్నాను. నేనెప్పుడూ బాధ్యతతోనే వ్యవహరించా. ఇక ముందు మరింత బాధ్యతతో పనిచేస్తా. నా ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నా'' అన్నారు.


Click it and Unblock the Notifications











