అల్లు అర్జున్ ఇంట్లో కూడా చెప్పలేదు.. బన్నీ అంటే ఇది అంటున్న బన్నీ వాసు!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటే ప్రాణం పెట్టి చేస్తాడు. బన్నీ డాన్సులు కానీ, నటన కానీ వెండి తెరపై అద్భుతంగా ఉంటాయి. దీని వెనుక బన్నీ కష్టం, అంకితభావం దాగున్నాయని నిర్మాత బన్నీ వాసు చెబుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా అల్లు అర్జున్ ని ప్రశంసలతో ముంచెత్తాడు. అల్లు అర్జున్ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు పంచుకున్నాడు.

ఒక్కొక్క మెట్టు
గంగోత్రి చిత్రంతో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్ ఆ తరువాత డాన్సులతో అలరిస్తూ, నటనలో పరిణితి కనబరుస్తూ ఒక్కో మెట్టు ఎదిగి స్టార్ గా మారాడు. తాను నటించే సినిమాని అల్లు అర్జున్ తనదిగా భావించి చేస్తాడని బన్నీ వాసు చెబుతున్నాడు.

బన్నీ సత్తాని బయటకు తీసిన చిత్రం
అల్లు అర్జున్ నటించిన గంగోత్రి చిత్రం మంచి విజయం సాధించింది. కానీ బన్నీలోని పూర్తి స్థాయి సత్తాని బయటకు తీసిన చిత్రం మాత్రం ఆర్య. సుకుమార్ దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అల్లు అర్జున్ కు మొదటినుంచి స్నేహితుడిగా ఉన్న బన్నీ వాసు ఆర్య సినిమా సమయంలో జరిగిన ఓ సంగతిని బయట పెట్టారు.

ఆ సాయంత్రమే బెంగుళూరుకు
ఆర్య షూటింగ్ రేపు ప్రారంభం కానుంది అనగా ముందురోజు ఉదయం బన్నీకి చెన్నైలో టాన్సిల్స్ సర్జరీ జరిగింది. ఆ రోజు సాయంత్రమే బెంగుళూరుకు వెళదాం అని అల్లు అర్జున్ తనతో అన్నట్లు బన్నీ వాసు తెలిపాడు. ఇంట్లో ఒక మాట చెప్పి బయలుదేరుదాం అని చెప్పినా వినిపించుకోలేదు.

కాస్ట్యూమ్స్ కోసం
రేపు షూటింగ్ ఉంది. బెంగుళూరుకు వెళ్లి కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసుకుందాం అని బన్నీ అన్నాడు. ఉదయమే జరిగిన సర్జరీని ఏమాత్రం లెక్కచేయలేదు. సినిమా పట్ల బన్నీకి ఉన్న ఆసక్తి, అంకితభావంకు ఇది ఉదాహరణ అని బన్నీ వాసు తెలిపాడు.

ఏది ఏమైనా సరే
అల్లు అర్జున్ కి నేను బెస్ట్ ఫ్రెండ్ ని. అయినా కూడా మా ఇద్దరి ఆలోచన విధానం పూర్తి భిన్నంగా ఉంటుందని బన్నీ వాసు తెలిపాడు. ఏది ఏమైనా సరే ఢీ కొడదాం అనేది స్వభావం. తాను మాత్రం కాస్త ఆచి తూచి వ్యవహరిస్తానని బన్నీ వాసు తెలిపాడు.

ఇప్పటికీ నిరీక్షణే
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శత్వంలో బన్నీ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నా అల్లు అర్జున్ మాత్రం ఇంకా ఓకే చేసినట్లు లేదు. అందుకే అధికారిక ప్రకటన ఆలస్యం అవుతోంది.


Click it and Unblock the Notifications











