నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్: యూ ఆర్ మై లైఫ్ అంటూ బన్నీ వ్యాస్ ఎమోషనల్ స్పీచ్

By Bojja Kumar

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం మే 4న గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన బన్నీ వ్యాస్(బన్నీ వాసు) మోషనల్‌గా ప్రసంగించారు.

కడుపు నిండిన అనుభూతి ఈ సినిమాతోనే

కడుపు నిండిన అనుభూతి ఈ సినిమాతోనే

‘మా ఇంట్లో మొదటి పూజ మెగాస్టార్ చిరంజీవి గారికి జరుగాలి. ఈ రోజు నేను ఈ స్టేజీ మీద నిలబడటానికి కారణం ఆయన ప్రోత్సాహమే. ఈ వేడుకకు హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు, మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి హీరో అభిమానులకు ధన్యవాదాలు. బన్నీ ప్రతి సినిమాకు నేను కలిసి పని చేశాను. కానీ బన్నీని స్క్రీన్ మీద చూసి కడుపు నిండిన అనుభూతి మాత్రం ఈ సినిమాతోనే కలిగింది అని బన్నీ వ్యాస్ తెలిపారు.

16 సంవత్సరాల క్రితం ఎటు వెళ్లాలో తెలియని అయోమయంలో ఉన్నపుడు

16 సంవత్సరాల క్రితం ఎటు వెళ్లాలో తెలియని అయోమయంలో ఉన్నపుడు

16 సంవత్సరాల క్రితం ఎటు వెళ్లాలో నాకు తెలియదు. అపుడు నా వయసు 20 సంవత్సరాలు. ఏం చేయాలో తెలియదు. అప్పుడు నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌లో ఉండి పాలకొల్లు నుండి హైదరాబాద్ వచ్చి శ్రీనగర్ కాలనీలో ఫ్రెండ్ రూములో ఉంటున్న రోజులు అవి. జీవితం ఎటు వెళ్లాలో తెలియని ఒక బ్లాంక్ స్క్రీన్లో ఉన్నపుడు నా భుజం మీద ఒక చెయ్యి పడింది. ఆ చేయే అల్లు అర్జున్. ఆ రోజు అల్లు అర్జున్ నాతో ఉంటావా? నాతో పని చేస్తావా? అని అడిగాడు. అపుడు తన ఏజ్ కూడా 20 ఏళ్లే. అపుడు నాకు జస్ట్ ఫ్రెండ్ కిందే పరిచయం... ఆ పరిచయం నా జీవితాన్ని మార్చేసింది అని బన్నీ వ్యాస్ తెలిపారు.

బన్నీ లాంటి తపన ఎవరిలోనూ చూడలేదు

బన్నీ లాంటి తపన ఎవరిలోనూ చూడలేదు

బన్నీ నటించిన తొలి సినిమా గంగోత్రి సినిమా రిలీజైనపుడు మెయిన్ థియేటర్లో క్యాంటీన్ దగ్గర చాలా కామెంట్లు వినిపించాయి. చాలా బాధేసింది. అక్కడి నుండి ఆర్య సినిమాలోపు ఒక మనిషి తనను తాను మార్చుకునే ప్రయాణం నా కళ్లారా చూశాను. బన్నీని ఫాలో అవ్వడం వల్ల నాలో కూడా మార్పు వచ్చింది. 20 ఏళ్ల కుర్రాడు తన ఫ్యూచర్ గురించి పడుతున్న తపన చూశాను. నా జీవితంలో కొన్ని లక్షల మందిని కలిశాను. ఇతనిలో చూసిన తపన ఎవరిలోనూ చూడలేదు. ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ఆ తపనే పని చేసింది. ఆ తపనే నా లాంటి ఎంతో మందికి స్పూర్తినిచ్చింది.... అని బన్నీ వ్యాస్ తెలిపారు.

లక్ష అడగటానికి కూడా సిగ్గు పడ్డాడు

లక్ష అడగటానికి కూడా సిగ్గు పడ్డాడు

నాకు ఒక విషయం బాగా గుర్తు. మాకు ఒక షెడ్డు ఉంది. ఆ షెడ్డు కట్టడానికి అరవింద్ గారిని బడ్జెట్ అడగటానికి బన్నీ నేను పడిన కష్టం నాకు తెలుసు. ఆ షెడ్డే చాలా సంవత్సరాలు బన్నీ ఆఫీసుగా కూడా మారింది. ఆ షెడ్డు కోసం లక్ష రూపాయలు అడగటానికి బన్నీ ఎంత మొహమాట పడ్డాడో, ఎంత సిగ్గు పడ్డాడో నాకు తెలుసు. ఈ రోజు ఆయన రెమ్యూనరేషన్ కోట్లు కోట్లు సంపాదిస్తున్నా కూడా ఈ రోజుకీ తను ఎవరినైనా అడగటానికి అదే విధంగా సిగ్గుపడతాడు. బన్నీ లాంటి వ్యక్తితో మంచి రిలేషన్ ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.... అని అరవింద్ తెలిపారు.

బన్నీ యూ ఆర్ మై లైఫ్...

బన్నీ యూ ఆర్ మై లైఫ్...

బన్నీ యూ ఆర్ మై లైఫ్.... యూఆర్ మై బ్రీత్... యూ ఆర్ మై సోల్. ఎన్నో సార్లు తిట్టుకున్నాం, ఎన్నో సార్లు కొట్టుకున్నాం. ఎన్నో సార్లు కలిశాం... కానీ దిస్ మ్యాన్ ఈజ్ మై లైఫ్.... అని బన్నీ బ్యాస్ ఎమోషనల్‌గా వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X