ఆ రోజంతా అల్లు అర్జున్ టెన్షన్ పడతూ నిద్రపోలేదు

By Srikanya

సినిమా రిలీజ్ రోజు నాకంటే అల్లు అర్జున్ ఎక్కువ టెన్షన్ పడ్డాడు. ఆ రోజంతా బన్ని నిద్రపోలేదు.బహుశా మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహమే ఇందుకు కారణం కావచ్చు అంటున్నారు '100% లవ్'నిర్మాత బన్నీ వాసు.ఆ చిత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న నేపధ్యంలో కలిసిన మీడియాతో అలా స్పందించారు.అలాగే నాదీ బన్నిది దాదాపు ఒకే అభిప్రాయం ఉంటుంది. ఏ విషయాన్నైనా ఇద్దరం చర్చిస్తాం. ఎక్కడా డిఫరెన్స్ లేకుండా చూసుకుంటాం. బన్ని నా స్నేహితుడు కావడం గాడ్ గిఫ్ట్ అని చెప్పారు.

ఇక '100% లవ్'చిత్రం ఎలా ప్రారంభమైందో చెపుతూ...'100% లవ్' సినిమా కథను ఆర్య సినిమా కంటే ముందే దర్శకుడు సుకుమార్ బన్నికి చెప్పాడు. ముందుగా ఈ సినిమా కథ విన్నది బన్నినే. ఆ తరువాత నేను విన్నా. ఆ తరువాత ఇద్దరం సుకుమార్‌తో కథ గురించి డిస్కస్ చేశాం. అందులో కొన్ని మార్పులను బన్ని చేయించారు. రెండేళ్ల కింద దీనిని ఆచరణలోకి తీసుకొచ్చాం అని హ్యాపీగా చెప్పారు.ప్రస్తుతం అయితే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నానని ఇప్పటికే కథ కూడా రెడీ అయిందని చెప్పారు.అలాగే ఓ ప్రముఖ దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తాడు. త్వరలోనే నటీనటుల వివరాలు తెలియజేస్తాడని అన్నారు.ఆ సినిమా కూడా '100% లవ్'లాగానే సక్సెస్ కావాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X