‘గబ్బర్ సింగ్’ వెస్ట్ బన్నీవాసుకే...
ప్రముఖ నిర్మాత బన్నీవాసు గబ్బర్ సింగ్ చిత్రం వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకున్నారు. ఇందు కోసం బన్నీ వాసు ఫ్యాన్సీ అమౌంట్ నిర్మాతలకు చెల్లించినట్లు సమాచారం. వెంకటేశ్వర క్రియేషన్స్ పై పలు విజయవంతమైన చిత్రాలు పంపిణీ చేసి భారీగా లాభాలు ఆర్జించిన బన్నీ వాసు గబ్బర్ సింగ్ కూడా తనకు లాభాలను తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్' చిత్రం రూపొందింది. బండ్ల గణేష్ ఈచిత్రానికి నిర్మాత. ఈ నెల 15న విడుదలైన ఆడియో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మాస్ బీట్స్ సంగీతం అభిమానుల్లో గబ్బర్ సింగ్ మేనియాకు దారి తీసింది.
చిత్ర యూనిట్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం మే రెండవ వారం(మే 11)లో ఈచిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో ఇప్పటికే సూపర్ హిట్ అయిన 'దబాంగ్' చిత్రానికి ఇది రీమేక్. పవర్ స్టార్ మేనరిజానికి తగిన విధంగా హరీష్ శంకర్ సినిమాను తీర్చి దిద్దాడని ట్రైలర్స్ లో స్పష్టం అవుతోంది.
ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: కడలి బ్రహ్మ, ఎడిటింగ్ గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగ్నేష్ సతీష్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











