సహాయం చేస్తే.. లింకేనా?, కాస్త ఎదగరా బాబు: కత్తికి బన్నీ కౌంటర్, సంజన కూడా!
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్-మహేష్ కత్తి వివాదం ఇప్పుడో హాట్ టాపిక్. ఎవరిని వెనకేసుకొచ్చేవాళ్లు వాళ్లను వెనకేసుకొస్తున్నారు. తోచిన విశ్లేషణలతో తప్పొప్పులు తేల్చేస్తున్నారు. వివాదం ఇంకా తెర పైనే ఉండటంతో.. పవన్ మద్దతుదారులు మహేష్ కత్తిపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా బన్నీవాసు ఆయనకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. హీరోయిన్ సంజన కూడా పవన్‌కు మద్దతు తెలిపారు.
Recommended Video


ఎదగరా బాబు..: బన్నీవాసు
'ఏ సంబంధం లేని ఓ యువతికి ఒక యువకుడు సహాయపడ్డాడంటే వారిద్దరి మధ్య ఏదో తప్పుడు సంబంధం ఉందని అర్థం చేసుకుంటే ఎలా?.. కాస్త ఎదగరా బాబూ..' అంటూ మహేష్ కత్తికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు బన్నీవాసు.

సంజన కామెంట్:
'కొంతమంది వ్యక్తులు కష్టపడి పైకి రావాలని ప్రయత్నించకుండా, సక్సెస్‌ఫుల్ అయినవారిని విమర్శిస్తూ పైకి రావాలని చూస్తున్నారు. అలాంటివారిని పట్టించుకోవద్దు.. మేమంతా మీతోనే ఉన్నాం పవన్ కల్యాణ్ సార్' అని హీరోయిన్ సంజన ట్వీట్ చేశారు.

ఆరు ప్రశ్నలు..:
వివాదంలోకి మధ్యలో ఎంటరైన హీరోయిన్ పూనం కౌర్ 'ఫ్యాట్సో' అంటూ మహేష్ కత్తిని పరోక్షంగా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. భిక్షగాళ్లకు డబ్బులు డొనేట్ చేయండి అని కూడా ఆమె కత్తిని పరోక్షంగా విమర్శించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మహేష్ కత్తి ఆరు ప్రశ్నలతో పెద్ద బాంబే పేల్చాడు.

ప్రశ్నల కలకలం..:
మహేష్ కత్తి లేవనెత్తిన ప్రశ్నలు పవన్ కల్యాణ్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా మారాయి. అందులో నిజానిజాలెంతో తెలియదు గానీ పవన్ శిబిరంలోనూ ఆందోళన మొదలైనట్లు గానే కనిపిస్తోంది. కాబట్టే ఈ వ్యహారానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా రచయిత కోన వెంకట్ ను పురమాయించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికి ఇది పరిస్థితి..:
తనకు పవన్ నుంచే నేరుగా సమాధానం రావాలని మహేష్ కత్తి భీష్మించుకు కూర్చున్నారు. అప్పటిదాకా తాను తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో వివాదం ఇంకెంత దూరం వెళ్తుందోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో రచయిత కోన వెంకట్ జనవరి 15వ తేదీ వరకు ఆగండి అంటూ ఇరు వర్గాలకు ఒక సూచన చేశారు. ఆ తర్వాత ఏం డిసైడ్ చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











