»   » ఎమ్మెల్యేకు రక్షకుడిగా అల్లు అర్జున్!

ఎమ్మెల్యేకు రక్షకుడిగా అల్లు అర్జున్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరైనోడు'. అల్లు అర్జున్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజైంది. పోస్టర్లో అల్లు అర్జున్ లుక్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఏమిటో తెలిసి పోయింది. ఇందులో బన్నీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని, యంగ్ ఎమ్మెల్యేకు రక్షకుడిగా ఉంటాడని సమాచారం. ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ నటిస్తోందని తెలుస్తోంది. ‘లోఫర్' చిత్రంలో హీరోయిన్ గా నటించిన దిశా పటాని ‘సరైనోడు'లో బన్నీతో స్పెషల్ ఐటం సాంగు చేస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తొలిసారిగా రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.

Bunny will be seen in Powerful cop

తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు'' అని బోయపాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

English summary
Boyapati Srinu’s directorial venture “Sarrainodu” starring Stylish Star Allu Arjun and Rakul Preet Singh is progressing at brisk pace and near the completion of the shoot. Bunny will be seen in Powerful cop who protects Young MLA.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu