అంత వరెస్ట్ సినిమా నేనెప్పుడూ చూడలేదు: రాజమౌళి

By Srikanya

రాజమౌళి రీసెంట్ గా ట్వీట్ చేస్తూ బర్రీడ్ అనే చిత్రం చాలా చెత్త సినిమా అని అంత వరస్ట్ సినిమాని ఎప్పుడూ చూడలేదన్నారు. అలాగే ఆర్జీవీ జూమ్(రామ్ గోపాల్ వర్మ),కిచ్చా సుదీప్(ఆర్టిస్టు) ఆ సినిమాని మెచ్చుకోవటం చూసి సినిమాని చాలా ఆసక్తిగా చూసానని చెప్పారు. గొప్ప కాన్సెప్టే కానీ పూర్ క్లైమాక్స్ అని అన్నారు.సుదీప్ ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న ఈగ చిత్రంలో నటిస్తున్నారు. నాని,సమంత కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం మార్కెట్లో మంచి క్రేజ్ ఇప్పటికే సంపాదించుకుంది.

ఇక బర్రీడ్ చిత్రం ఇరాక్ వార్ టైమ్ లో జరిగే ధ్రిల్లర్. ఓ అమెరికన్ ట్రక్ డ్రైవర్ ని లేచేసరికి ఓ చెక్క శవపేటికలో ఉన్నానని తెలుసుకుంటాడు. అంతా చీకటిగా ఉంటుంది. బ్రతికుండగానే పాతిపెట్టబడ్డానని అర్దం చేసుకుంటాడు. ఆ సమయంలో అతని వద్ద కేవలం ఓ సిగెరట్ లైటర్ మాత్రమే ఉంటుంది. అలాగే అక్కడ అతను బ్రతకటానకి సరిపడేంత గాలి కూడ ఉండదు. కాస్సేపటికి అక్కడున్న ఓ సెల్ ఫోన్ ఉందని తెలుసుకుంటాడు.లైటర్ సాయింతో అక్కడ చూస్తూ సెల్ ఫోన్ సాయింతో అతను బయిట ప్రపంచంలోకి ఎలా వచ్చాడన్న దిశలో కధనం నడుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X