Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్‌గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ అనామక జూనియర్ ఆర్టిస్టే....ఈ బర్నింగ్ స్టార్!
హైదరాబాద్: 'హృదయ కాలేయం' చిత్రం వెరైటీ టీజర్లును యూ ట్యూబులో విడుదల చేసి ఇంటర్నెట్ ద్వారా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సంపూర్ణేష్ బాబు గురించి అంతకు ముందు ఎవరికీ తెలియదు. అంతా ఇతనెవరో కొత్త నటుడు అనే అనుకున్నారు. తాజాగా సంపూర్ణేష్ బాబు గురించిన ఓ విషయం సోషల్ నెట్వర్కింగులో చర్చనీయాంశం అయింది.
సంపూర్ణేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టాడని, కృష్ణ వంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'మహాత్మ' చిత్రంలో ఓ చిన్న పాత్ర కూడా పోషించాడని తాజాగా సోషల్ నెట్వర్కింగులో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో ఫుటేజీ బట్టి స్పష్టం అవుతోంది. అ అనామక జూనియర్ ఆర్టిస్టే....దర్శకుడు స్టీవెన్ శంకర్ కారణంగా ఇంటర్నెట్ స్టార్‌గా, బర్నింగ్ స్టార్‌గా మారి పోయాడు.
స్టీవెన్ శంకర్‌కు సంపూర్ణేష్ బాబు ఓ ఫంక్షన్లో పరిచయం అయ్యాడు. తన కథకు సరిపోయే హీరో లక్షణాలు అతనిలో ఉండటంతో అతనికి కథ గురించి చెప్పాడు. అసలే అవకాశాలు లేక అల్లాడుతున్న సంపూర్ణేష్ బాబు రెట్టె విరిగి నేతిలో పడ్డట్లయింది. ఏం చేయడానికైనా సిద్ధం....నా కావాల్సింది నటించే అవకాశం...నా లాంటి అనామకుడిని హీరోని చేస్తానంటే వద్దంటానా? అని దర్శకుడికి చెప్పేసాడు. అలా హృదయ కాలేయం సినిమాకు సంపూర్ణేష్ బాబు హీరో అయ్యాడు.
సంపూర్ణేష్ బాబు మొదటి సినిమా 'హృదయ కాలేయం' ఇంకా విడుదల కానేలేదు...అప్పుడే మరో సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్నాడు. అల్లు శిరీష్-రెజీనా జంటగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న 'కొత్త జంట' చిత్రంలో సంపూర్ణేష్ బాబు కూడా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ముఖ్యమైన పాత్రలో చేస్తున్నాడట.
శ్రీను వైట్ల సినిమాల్లో బ్రహ్మానందం పాత్ర సినిమాకు ఎంత కీలకంగా ఉంటుందో....మారుతి 'కొత్త జంట' చిత్రంలో సంపూర్ణేష్ బాబు పాత్ర కూడా అదే తరహాలో ఎంతో కీలకంగా ఉండనుందని సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.