twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి కోసం తన్నులు తిన్నాను.. పవన్‌తో కష్టమని భయపెట్టించారు..

    By Rajababu
    |

    తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతంగా రాణిస్తున్న మాటల రచయితల్లో బుర్రా సాయిమాధవ్‌ ఆయనకు ఆయనే సాటి. ఏన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి.. అనేక ఆటుపోట్లకు గురైంది ఆయన జీవితం. అయినా మనో నిబ్బరం కోల్పోకుండా తాను అనుకొన్న లక్ష్యంవైపు నడుచుకొంటూ వెళ్లిపోయాడు. 2013లో కృష్ణ వందే జగద్గురుతో రైటర్‌గా ప్రారంభమైంది. గోపాల గోపాలా స్టార్ స్టేటస్ ఇచ్చింది.

    Recommended Video

    Saidharm Tej's Movie With Karunakaran New Movie Get Started

    బాలకృష్ణ 100 చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి, చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 లాంటి చిత్రాలకు ఏకకాలంలో మాటలు రాసి మెప్పించారు. తాజాగా మహానటి సావిత్రి, ఎన్టీఆర్ బయోపిక్, సైరా నర్సింహరెడ్డి చిత్రాలకు మాటలు రాస్తున్నారు. తనదైన మాటలతో దూసుకెళ్తున్న బుర్రా సాయిమాధవ్ ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బుర్రా సాయి మాధవ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

    కృష్ణ వందే జగద్గురు చిత్రంతో

    కృష్ణ వందే జగద్గురు చిత్రంతో

    కృష్ణ వందే జగద్గురు చిత్రం తర్వాత నేను చేసిన కొన్ని పొరపాట్ల వల్ల రెండేళ్లు గ్యాప్ వచ్చింది. మళ్లీ మళ్లీ రాని రోజు సినిమాకు మాటలు రాస్తున్న సమయంలో గోపాల గోపాలా సినిమా అవకాశం వచ్చింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేయడం కష్టం అని భయపెట్టారు. కానీ పవన్ కల్యాణ్‌తో పనిచేయడం చాలా ఈజీ అనేది తెలుసుకొన్నాను. కష్టం అనుకొనే వారికి పనిచేయడం చేతకాదని తెలుసుకొన్నాను.

     పవన్ పనిచేయడం ఓ అద్భుతం

    పవన్ పనిచేయడం ఓ అద్భుతం

    పవన్ కల్యాణ్‌తో పనిచేయడం అంటే ఓ అద్భుతం. ఆయనతో కూర్చొంటే ఎదుటి వ్యక్తిలో పవర్ జనరేట్ అవుతుంది. ఆయన ఒక ఎన్‌సైక్లోపిడియా. సినిమా పరిశ్రమలో అన్ని విభాగాలపై పట్టు ఉంది. అనర్గళంగా మాట్లాడుతుంటారు. గోపాల గోపాలా సెట్లోకి పవన్ వచ్చి నేను రాసిన డైలాగ్స్ చెప్పిన వెంటనే నేను పెద్ద రైటర్‌ను అయిపోయాను అంటే ఆయన నవ్వారు.

    చిరంజీవి కోసం తన్నులు తిన్నాను..

    చిరంజీవి కోసం తన్నులు తిన్నాను..

    ఖైదీ నంబర్ 150 చిత్రానికి మాటలు రాసే అవకాశం రావడం మాటల్లో చెప్పలేను. ఎందుకంటే చిరంజీవి నాకు స్ఫూర్తి. ఆయన సినిమాల కోసం తెనాలి థియేటరో చొక్కాలు చింపుకొన్నాను. తన్నులు తిన్నాను. చాలా మంది తన్నాను. చిరంజీవి అంటే నాకు పిచ్చి. అలాగే నేను స్వర్గీయ ఎన్టీఆర్ బిగ్ ఫ్యాన్. అలాగే బాలయ్య అంటే ఇష్టం. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరినీ ఇష్టపడే వారిలో నేను కూడా ఒక్కరిని.

    చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి

    చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి

    ఖైదీ నంబర్ 150కి ముందు ఒకరోజు నాగబాబు ఫోన్ చేసి అన్నయ్య ఫోన్ చేస్తారని చెప్పారు. అయితే నాకు సరిగా అర్థం కాలేదు. దాంతో ఎవరు ఫోన్ చేస్తారు అని మళ్లీ అడిగాను. దాంతో అన్నయ ఫోన్ చేస్తాడు అని చెప్పాడు. చిరంజీవి నాకు ఎందుకు ఫోన్ చేస్తాడులే అనుకొని.. మళ్లీ ఎవరు ఫోన్ చేస్తారు అని అడిగా.. దాంతో కొంత చిరాకుతో మా అన్నయ్య ఫోన్ చేస్తాడు అని నాగబాబు చెప్పారు.

     చిరంజీవి గొప్పతనం అదే

    చిరంజీవి గొప్పతనం అదే

    చిరంజీవి నాకు ఎందుకు ఫోన్ చేస్తారు అనే ప్రశ్నలతో కాసేపు మనసు గందరగోళంగా మారింది. కర్టెక్ట్‌గా ఐదు నిమిషాల తర్వాత చిరంజీవి ఫోన్ చేశారు. మీరు బిజీగా ఉన్నారా? లేదా ఖాళీగా ఉన్నారా? ఫ్రీగా ఉంటే ఓసారి మా ఆఫీస్‌కు వస్తారా? అని చాలా మర్యాదగా అడిగారు. వెంటనే సార్ నేను ఇప్పుడే వస్తున్నాను అని కొణిదెల ప్రొడక్షన్ ఆఫీస్‌కు వెళ్లాను. అప్పుడు నా సినిమాకు మాటలు రాయాలి అనగానే ఒక్కసారి షాక్ గురయ్యాను. దాంతో నేను కన్న కలలన్నీ నిజమయ్యాయని అనిపించింది.

     సైరా చరిత్రలో నిలుస్తుంది

    సైరా చరిత్రలో నిలుస్తుంది

    ప్రస్తుతం మళ్లీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం సైరా నర్సింహారెడ్డి. ఆ చిత్రానికి చిరంజీవి మాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా చిరంజీవి ఎప్పుడో చేయాల్సి ఉంది. కానీ నాకు కోసమే ఆ సినిమా ఆగిందా అనే అనుమానం కలిగింది. సైరా సినిమాకు మాటలు రాసే అవకాశం రావడం దేవుడు వరం. సైరా చిత్రం చరిత్ర సృష్టిస్తుంది. చరిత్రలో నిలిచిపోతుంది.

     సురేందర్ రెడ్డి అద్భుతమైన రీసెర్ఛ్

    సురేందర్ రెడ్డి అద్భుతమైన రీసెర్ఛ్

    సైరా చిత్రం గురించి దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతమైన పరిశోధన చేశాడు. కథ మంచిగా వచ్చింది. ఆయన చేసిన పరిశోధనతో నాకు పనిచేయడం నాకు సులభమైంది. నేను కూడా ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి కథను తెలుసుకొన్నాను. ఎన్నో భావోద్వేగాలు ఉన్న చిత్రం సైరా.

     సావిత్రి అంటే ఎన్టీఆర్ లాంటి స్టేటస్

    సావిత్రి అంటే ఎన్టీఆర్ లాంటి స్టేటస్

    మహనటి సావిత్రి బయోపిక్‌కు పనిచేయడం మరిచిపోలేని అనుభవం. మహాకవి శ్రీశ్రీ అంటారు. మహానటి సావిత్రి మాత్రమే అంటారు. సావిత్రి అంటే స్వర్గీయ ఎన్టీఆర్ లాంటి స్టేటస్. ఈ సినిమాలో ఎస్వీ రంగారావు, చక్రపాణి, ఎల్వీ ప్రసాద్, జెమినీ గణేషన్ లాంటి మహాదిగ్గజాలకు మాటలు రాయడం అంటే ఆషామాషీ కాదు. సావిత్రి బయోపిక్‌లో చాలా ఉద్వేగం ఉన్న కథ. అలాంటి కథకు మాటలు రాస్తున్న సమయంలో కన్నీళు రావడంతో డైలాగ్ పేపర్లన్నీ తడిచిపోయాయి.

    ఎన్టీఆర్ బయోపిక్ లైఫ్ టైమ్..

    ఎన్టీఆర్ బయోపిక్ లైఫ్ టైమ్..

    స్వర్గీయ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అంటే పిచ్చి. ఆయనతో పనిచేసే అదృష్టం రాలేదు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా ఆయనకు మాటలు రాసే ఛాన్స్ రావడం లైఫ్ అచీవ్‌మెంట్. బయోపిక్ అవకాశం రావడంతో పొంగిపోయాను. ఇంట్లోకి వచ్చి నా బాల్య స్నేహితులందరికీ ఫోన్ చేసి ఆనందాన్ని పంచుకొన్నాను. రామారావు గారే ఆశీర్వదించి.. వీడు నా అభిమాని అని బాలయ్యకు చెప్పి.. వీడికి మాటలు రాసే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఉంటారని నాకు నేను అనుకొంటాను.

    పూర్వ జన్మ సుకృతం

    పూర్వ జన్మ సుకృతం

    ప్రస్తుతం నా జీవితంలో అద్బుతమైన ఘట్టం కొనసాగుతున్నది. ఎన్టీఆర్ బయోపిక్, సావిత్రి బయోపిక్, సైరా నర్సింహారెడ్డి చిత్రాలకు మాటలు రాయడమనే పూర్వ జన్మ సుకృతం. చరిత్రలో నిలిచిపోయే సినిమాలకు మాటలు రాయడం అంటే మాటల్లో చెప్పలేను.

    ర్యాంకింగ్‌లు పట్టించుకోను..

    ర్యాంకింగ్‌లు పట్టించుకోను..

    ఇండస్ట్రీలో ర్యాంకింగ్‌ అనేవి పట్టించుకోను. ఎందుకంటే అవి ఒకరోజు ఉంటాయి. మరో రోజు ఉండవు. ఎలాంటి ప్రాజెక్టులు చేస్తున్నాం. ప్రేక్షకులు ఎలా మెచ్చుకొంటున్నారు. ఎంత బాగా రాస్తున్నాను అనేది నాకు ముఖ్యం. ఇండస్ట్రీలో నా ర్యాంక్ ఏంటో ప్రేక్షకుల నుంచి స్పందనే చెబుతుంది.

    English summary
    Sai Madhav Burra is screenwriter best known for his work in Telugu cinema. He wrote dialogues for the films Khaidi No.150 and Gautamiputra Satakarni for the actors Chiranjeevi and Nandamuri Balakrishna. His early work in dialogues includes Malli Malli Idi Rani Roju and Krishnam Vande Jagadgurum. Now he is penning for prestigious projects like NTR Biopic, Savitri Biopic, and Sye Raa Narsimha Reddy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X