హీరో, డైరెక్టర్ కలిసి నిర్మాతను దెబ్బ కొడుతున్నారు
ఇదివరకు నిర్మాత, హీరో ఓ జట్టుగా ఉండేవాళ్లు. ఇప్పుడు హీరో, డైరెక్టర్ కొజట్టయి, నిర్మాతని వేరు చేస్తున్నారు. చాలామంది హీరోలు, దర్శకులకి నిర్మాణంలో ఏమాత్రం జోక్యం చేసుకోని నిర్మాతలే కావాలి. సినిమా నిర్మాణంలో వాళ్ల జోక్యం 100 శాతం ఉంటే, నిర్మాత జోక్యం 10 శాతం ఉంటోంది అంటున్నారు ఆవేదనగా ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ.ఆయన రీసెంట్ గా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే నిజానికి మిగతా రంగాల్లో పెట్టుబడిదారుడు అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. సినీ రంగంలో అది జరగడం లేదుఈ పరిస్థితికి వరుగుడు ఒక్కటే. నిర్మాతకి హీరోలు, డైరెక్టర్లు కలిసి రావాలి. ఆ ఇద్దరూ తలచుకుంటే కాస్ట్ కంట్రోల్ అవుతుంది. ఇది వాస్తవం.
ఇండస్ట్రీని కాపాడుకోవాలనే ఆలోచన వాళ్లకి ఉండాలి. నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టులు కలిసి మాట్లాడుకుని, ఒక మాట మీదుంటేనే ఏవైనా అనుకున్నవి చెయ్యగలం. అలా కాకుండా ఎన్ని ఒన్ సైడెడ్‌గా ఎన్ని రెగ్యులేషన్లు పెట్టుకున్నా ప్రయోజనం లేదు అన్నారు . ప్రస్తుతం తాను నిర్మిస్తున్న చిత్రం గురించి చెబుతూ.... సెప్టెంబర్ నుంచి రవితేజ హీరోగా నేను నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. డైరెక్టర్ శివ మా బేనర్‌లో ఇదివరకు సినిమాటోగ్రాఫర్‌గా చేశాడు. అతని సామర్థ్యం గురించి నాకు బాగా తెలుసు. అందుకే అతని డైరెక్షన్‌లో ఈ సినిమా చేస్తున్నా. 'శ్రీరామ్' తర్వాత నేను నిర్మిస్తున్న సినిమా ఇదే. ఆ సినిమాకి కూడా శివ పనిచేశాడు. వచ్చే ఏడాది మార్చికి మా కొత్త సినిమా రిలీజవుతుంది అన్నారు.


Click it and Unblock the Notifications











