'బిజినెస్ మ్యాన్' వార్నింగ్ లు మొదలయ్యాయి
ఏదైనా సినిమా రిలీజవుతుంటే పైరసీ అనేది ఓ పీడలా తగులుకుంది. దాంతో సినిమా రిలీజ్ కు ముందు నుంచీ సినిమాతో పాటే పైరసీకు చెందిన వార్నింగ్ లు విడుదల చేయాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ మేరకు బిజినెస్ మ్యాన్ సినిమా ఈ వారంలో విడుదల అవుతూంటే..ముందుగానే ఈ చిత్రానికి చెందిన యాంటీ పైరసీ ప్రెస్ నోట్ ని విడుదల చేసారు. వారు ఆన్ లైన్ పైరసీ విషయంలో చాలా కఠినంగా వ్యవరించనున్నట్లు తెలియచేసారు. ఎవరైనా పైరైటెడ్ వెర్షన్స్ లింక్ లు ప్రమేట్ చేస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చిరిస్తున్నారు. అలాగే తమ సినిమాకు చెందిన పైరైటెడ్ వెర్షన్ లింక్ లు ఎక్కడైనా కనపడితే[email protected], లేదా [email protected] లేదా [email protected] కి తెలిచేయాలని కోరారు.అలాగే ఆన్ లైన్ లో http://www.antipiracytool.com/report.html కి తెలియచేసినా తాము చర్య తీసుకుని ఆ లింక్ లను బ్లాక్ చేస్తామని వారు తెలియచేస్తున్నారు.
అలాగే ఎవరైనా బిజినెస్ మ్యాన్ చిత్రానికి సంభందించి పైరేటెడ్ లింక్ లను తమ బ్లాగ్ లో కానీ,వెబ్ సైట్ లో కానీ పోస్ట్ చేస్తే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాక ఆ సైట్ లను,బ్లాగ్ లను బ్లాక్ చేస్తామని చెప్తున్నారు. ఆ డొమైన్ రిజిస్ట్రేషన్ ఏ దేశంలో ఉన్నా తాము వెనకాడబోమని,అక్కడ గవర్నమెంట్ లతో మాట్లాడి వెంటనే బ్లాక్ చేస్తామని చెప్తున్నారు. ఈ ప్రకటన వెంకట్ గరికపాటి పేరున విడుదల అయ్యింది.


Click it and Unblock the Notifications











