పుస్తకంగా 'బిజినెస్ మ్యాన్' స్క్ర్రిప్టు
నా చిన్నప్పుడు మా ఇంట్లో చాలా పుస్తకాలుండేవి. అందులో 'తోడికోడలు' స్క్రిప్ట్ కూడా ఉండేది. ఆ స్క్రిప్ట్ నేను చదువుకొన్నాను. సినిమా స్క్రిప్ట్ అంటే ఇలా ఉంటుందని అప్పుడే తెలుసుకొన్నాను. ఆ స్ఫూర్తితోనే 'బిజినెస్ మ్యాన్' పుస్తకం విడుదల చేస్తున్నాను. సంభాషణలు, ఛాయాచిత్రాలు అన్నీ అందులో ఉంటాయి అన్నారు పూరీ జగన్నాధ్. ఆయన తన తాజా చిత్రం 'బిజినెస్ మ్యాన్'ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే మా 'బిజినెస్‌మేన్' అంచనాలకు మించి విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. మూడు రోజుల్లో రూ.38.16కోట్ల గ్రాస్, రూ,27.35 షేర్‌ను వసూలు చేసి రికార్డును సృష్టించింది. అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కనిపించిన వారందరూ 'మా హీరోకి మంచి హిట్ ఇచ్చారు'అంటుంటే ఆనందంగా ఉంది''అన్నారు పూరి జగన్నాథ్.
ఇక ఇది వందశాతం మహేష్‌బాబు మార్క్ సినిమానే. ఆయన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ కథ తయారు చేశాను. మహేష్‌లాంటి స్టార్‌తో కాకుండా ఈ కథని వేరొకరితో చేసుంటే ఇంత పెద్ద స్థాయిలో విడుదలయ్యేది కాదు. ఇంతగా ప్రేక్షకులకి చేరువయ్యేది కాదు. త్వరలోనే ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తాను. కథానాయకుడు ఎవరనే విషయం వారం రోజుల్లో తెలుస్తుంది. ఎన్టీఆర్, రవితేజలతో తరువాత సినిమాలు చేస్తాను అని తెలిపారు.


Click it and Unblock the Notifications











